Advertisement

  • క్షిపణుల అభివృద్ధిలో దూసుకుపోతున్న భారత దేశం...

క్షిపణుల అభివృద్ధిలో దూసుకుపోతున్న భారత దేశం...

By: chandrasekar Fri, 23 Oct 2020 3:31 PM

క్షిపణుల అభివృద్ధిలో దూసుకుపోతున్న భారత దేశం...


గురువారం రాజస్థాన్‌లోని పోఖ్రాన్ రేంజ్‌లో భారత దేశపు థర్డ్ జనరేషన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ నాగ్‌ తుది పరీక్ష విజయవంతమైంది. ఓ వార్‌హెడ్‌కు ఈ మిసైల్‌ను ఇంటిగ్రేట్ చేసి ప్రయోగించారు. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ డీఆర్‌డీవో తెలిపిన వివరాల ప్రకారం, మిసైల్ కారియర్ ఎన్ఏఎంఐసీఏ నుంచి నాగ్ మిసైల్‌ను ప్రయోగించి, పరీక్షించారు. ఇది లక్ష్యాన్ని ఖచ్చితంగా ధ్వంసం చేసింది. డమ్మీ ట్యాంక్ ఆర్మర్‌ను నాశనం చేసింది.

పగలు, రాత్రి సమయాల్లో భారీ ఆయుధాలు కలిగిన శత్రు ట్యాంకులను ధ్వంసం చేయడానికి నాగ్ మిసైల్ ఉపయోగపడుతుంది. 4 కిలోమీటర్ల నుంచి 7 కిలోమీటర్ల పరిథిలోని లక్ష్యాన్ని ఈ మిసైల్ ధ్వంసం చేయగలదు. భూమి ఉపరితలం, గగనతలం నుంచి దీనిని ప్రయోగించవచ్చు. తుది పరీక్ష విజయవంతం కావడంతో నాగ్ మిసైల్‌ను భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఉత్పత్తి చేస్తుంది. ఎన్ఏఎంఐసీఏను మెదక్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తయారు చేస్తుంది. నాగ్ మిసైల్ పరీక్ష విజయవంతమైన నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డీఆర్‌డీవోను, భారత సైన్యాన్ని అభినందించారు.

Tags :
|

Advertisement