Advertisement

  • ‘‘21వ శాతాబ్దంతో భారత్ కొత్త విధానాలు, కొత్త నిబంధనలతో ముందుకు సాగాలి": పి.ఏం.మోడి

‘‘21వ శాతాబ్దంతో భారత్ కొత్త విధానాలు, కొత్త నిబంధనలతో ముందుకు సాగాలి": పి.ఏం.మోడి

By: chandrasekar Sat, 15 Aug 2020 5:00 PM

‘‘21వ శాతాబ్దంతో భారత్ కొత్త విధానాలు, కొత్త నిబంధనలతో ముందుకు సాగాలి": పి.ఏం.మోడి


74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎర్ర కోటపై నుంచి ఆయన ప్రసంగించారు. కరోనావైరస్‌కు కళ్లెం వేసేందుకు మూడు వ్యాక్సీన్‌లను భారత్ తయారు చేస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. 'అందరూ కరోనావైరస్ గురించి ఆందోళన పడుతున్నారు. వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్నారు. భారత్ ఒకటి కాదు మూడు వ్యాక్సీన్‌లను తయారు చేస్తోంది. వీటి అభివృద్ధి వివిధ దశల్లో ఉంది. క్లినికల్ ట్రయల్స్ పూర్తయిన వెంటనే వీటిని భారీ స్థాయిలో ఉత్పత్తి చేస్తాం''

''త్వరలో నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్‌ను ప్రారంభిస్తాం. దీనిలో భాగంగా అందరికీ హెల్త్ ఐడీలు ఇస్తాం. వీటి సాయంతో ఆరోగ్య రికార్డులు భద్రపరుస్తాం.'' ‘‘వచ్చే ఐదేళ్లలో దేశ అంచనాలు, ఆకాంక్షలను అందుకుంటామని గతేడాది ఎర్ర కోటపై నుంచి చెప్పాను. ఈ ఏడాది కాలంలో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాం. చాలా ప్రధానమైన లక్ష్యాలను అధిగమించాం’’. ‘‘అసాధారణ సమయాల్లోనూ అసాధ్యంగా అనిపించే లక్ష్యాలను భారత్ చేరుకోగలిగింది. ఇదే సంకల్పంతో ప్రతి భారతీయుడు మందుకు నడవాలి. 2022తో మన స్వాతంత్య్రానికి 75ఏళ్లు పూర్తవుతాయి’’. ‘‘21వ శాతాబ్దంతో భారత్ కొత్త విధానాలు, కొత్త నిబంధనలతో ముందుకు సాగాలి. ఇప్పుడు సాధాణ విధానాలు పనిచేయవు’’

Tags :
|

Advertisement