Advertisement

  • సచిన్ , సెహ్వాగ్ వంటి ఆటగాళ్లు లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది ...బద్రీనాథ్

సచిన్ , సెహ్వాగ్ వంటి ఆటగాళ్లు లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది ...బద్రీనాథ్

By: Sankar Tue, 01 Dec 2020 4:32 PM

సచిన్ , సెహ్వాగ్ వంటి ఆటగాళ్లు లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది ...బద్రీనాథ్


ఆస్రలియాతో జరుగుతున్న వన్ డే సిరీస్లో టీం ఇండియా వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిపోయి సిరీస్ పోగొట్టుకున్న విషయం తెలిసిందే...అయితే ఈ ఓటమిపై మాజీ ఆటగాళ్లు టీమిండియా ఆటతీరు మీద విమర్శలు గుప్పిస్తున్నారు...ఇప్పటికే గంభీర్ , మంజ్రేకర్ వంటి ఆటగాళ్లు స్పందించగా తాజాగా బద్రీనాథ్ మాట్లాడాడు...

భారత్‌ టాప్‌ ఆర్డర్‌లో వీరేంద్ర సెహ్వాగ్‌, సౌరవ్‌ గంగూలీ, సచిన్‌ టెండుల్కర్‌ వంటి ఆటగాళ్ల లేరని అభిప్రాయపడ్డారు. మంగళవారం ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో బద్రీనాథ్‌ మాట్లాడుతూ.. ‘ఆసీస్‌ సీరిస్‌లో భారత బౌలర్ల వైఫల్యం ప్రధానంగా కనిపిస్తోంది. ప్రధాన బౌలర్లు షమీ, బుమ్రా ధారాళంగా పరుగులు ఇచ్చారు. వికెట్ల వేటలో వెనుకబడ్డారు.

అయితే అన్ని పిచ్‌లు బౌలర్లుకు అనుకూలంగా ఉంటాయని చెప్పలేం. భారత టాప్‌ఆర్డర్‌లో సెహ్వాగ్‌, సచిన్‌, గంగూలీ వంటి ఆటగాళ్ల లేనిలోటు స్పష్టంగా కనిపిస్తోంది. వీరు బ్యాటింగ్‌తో పాటు వీలైన సందర్భాల్లో బౌలింగ్‌ కూడా చేయగలరు. బౌలర్లు అలసిపోయినప్పుడు, పిచ్‌కు పేస్‌కు అనుకూలించనప్పుడు వీరు బౌలింగ్‌ చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి..వీరు ముగ్గురు కలిసి 10 ఓవర్ల వరకు బౌలింగ్‌ చేయగలరు.

కానీ ఇప్పుడు పరిస్థితి అలాలేదు. భారమంతా బౌలర్ల మీదే పడుతోంది. వారు విఫలమైన సందర్భాల్లో ఆదుకోవడానికి టీంలో ఒక్కరు కూడా పార్ట్‌టైం బౌలర్లు లేరు. ధావన్‌, అగర్వాల్‌, శ్రేయస్‌ అయ్యార్‌, కేఎల్‌ రాహుల్‌, వీరిలో ఎవరూ కూడా బౌలింగ్‌ చేయలేరు. గతంలో రోహిత్‌ స్పిన్నర్‌గా జట్టుగా అందుబాటులో ఉండేవాడు. ఇప్పుడు దూరంగా ఉంటున్నారు. ఆల్‌రౌండర్‌ హర్థిక్‌ పాండ్యా సైతం బౌలింగ్‌ చేసే పరిస్థితిలో లేడు. ఈ పరిణామం టీమిండియాకు ఇబ్బందికరంగా మారింది.’ అని అభిప్రాయపడ్డాడు.

Tags :
|
|
|

Advertisement