Advertisement

  • భారత్ లో డిసెంబర్ నాటికీ పది కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి ...ఆస్ట్రాజెనిక

భారత్ లో డిసెంబర్ నాటికీ పది కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి ...ఆస్ట్రాజెనిక

By: Sankar Sun, 15 Nov 2020 06:26 AM

భారత్ లో డిసెంబర్ నాటికీ పది కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి ...ఆస్ట్రాజెనిక


డిసెంబర్ నాటికి భారత్‌లో 10 కోట్ల డోస్‌ల కోవిడ్‌ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆస్ట్రాజెన్‌కా వెల్లడించింది. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకాలు భారత్‌లో సంయుక్తంగా తయారు చేస్తోన్న 'అస్త్ర జెనికా' అనే కరోనా వ్యాక్సిన్‌‌ను ఉత్పత్తి చేస్తోన్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఆస్ట్రాజెన్‌కా టీకా చివరి దశ క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అదార్‌ పూనవాలా అన్నారు. కరోనా వైరస్‌ను ఈ టీకా సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు వెల్లడైతే.. అత్యవసర అనుమతి కింద బిలియన్‌ (వంద కోట్ల) డోసులను డిసెంబర్‌ నాటికి ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు.

ఈ మొత్తం డోసులన్నీ భారత్‌కు వెళ్లనున్నాయని పూనవాలా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కొవిడ్ వ్యాక్సిన్ వినియోగానికి 2021లో పూర్తిస్థాయి అనుమతులు లభిస్తే 50-50 శాతం నిష్పత్తితో దక్షిణ ఆసియా దేశాలకు, పేద దేశాలకు సరఫరా చెయ్యాలని నిర్ణయించినట్లు తెలిపారు.

Tags :
|

Advertisement