Advertisement

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో భారత్ శుభారంభం...

By: chandrasekar Fri, 04 Dec 2020 7:14 PM

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో భారత్ శుభారంభం...


టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై వన్డే సిరీస్‌ని కోల్పోయింది... కానీ, టీ20 సిరీస్‌ని మాత్రం ఘనంగా ఆరంభించింది. కాన్‌బెర్రా వేదికగా శుక్రవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ (51: 40 బంతుల్లో 5x4, 1x6), రవీంద్ర జడేజా (44 నాటౌట్: 23 బంతుల్లో 5x4, 1x6) నిలకడగా ఆడటంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.

అనంతరం బౌలింగ్‌లో చెలరేగిన చాహల్ (3/25), నటరాజన్ (3/30).. ఛేదనలో ఆస్ట్రేలియాని 150/7కే పరిమితం చేసింది. దాంతో.. 11 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న టీమిండియా.. మూడు టీ20ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో టీ20 మ్యాచ్‌ సిడ్నీ వేదికగా ఆదివారం జరగనుంది.

162 పరుగుల లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియాకి ఓపెనర్లు అరోన్ ఫించ్ (35: 26 బంతుల్లో 5x4, 1x6), డీఆర్క్ షార్ట్ (34: 38 బంతుల్లో 3x4) మెరుగుగా ప్రారంభించారు. తొలి వికెట్‌కి 7.4 ఓవర్లలో 56 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పిన ఈ జోడీని.. ఫించ్‌ను ఔట్ చేయడం చాహల్ విడదీశాడు. ఆ తర్వాత వచ్చిన స్టీవ్‌స్మిత్ (12)ని కూడా చాహల్ ఔట్ చేయగా ప్రమాదకర మాక్స్‌వెల్ (2: 3 బంతుల్లో)ని నటరాజన్ బోల్తా కొట్టించాడు.

మిడిల్ ఓవర్లలో హెన్రిక్యూస్ (30: 20 బంతుల్లో 1x4, 1x6) కాస్త ఫర్వాలేదనిపించినా.. అతనికి సరైన సహకారం లభించలేదు. మాథ్యూవెడ్ (7), సీన్ అబాట్ (12), మిచెల్ స్టార్క్ (1) దూకుడుగా ఆడే ప్రయత్నంలో వికెట్ చేజార్చుకున్నారు.

Tags :
|
|
|

Advertisement