Advertisement

  • కరోనా విషయంలో భారత్ ఇతర దేశాలకంటే మెరుగైన స్థానంలో ఉంది.. నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్

కరోనా విషయంలో భారత్ ఇతర దేశాలకంటే మెరుగైన స్థానంలో ఉంది.. నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్

By: Sankar Sun, 18 Oct 2020 4:46 PM

కరోనా విషయంలో భారత్ ఇతర దేశాలకంటే మెరుగైన స్థానంలో ఉంది.. నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్


దేశవ్యాప్యంగా చాలా రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ మహమ్మారి వ్యాప్తి స్థిరీకరించింది. గడిచిన మూడు వారాల్లో కొత్త కరోనా వైరస్‌ కేసుల నమోదు, మరణాల సంఖ్య తగ్గినట్లు కేంద్రం తెలిపింది. అయితే, సెకండ్‌ వేవ్‌ను తోసిపుచ్చలేమని పేర్కొన్నది. రానున్న శీతాకాలంలో కరోనా వైరస్‌ వ్యాప్తి మరోసారి ఉండే అవకాశాలు ఉన్నందున ప్రజలు తగు జాగ్రత్తతో ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తున్నది.భారతదేశం తన పరీక్షా సామర్థ్యాన్ని జనవరిలో ఒకటి నుంచి ప్రస్తుతం 9.32 కోట్లకు పైగా పెంచింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని తెలిపింది.

చాలా ఎక్కువ పరీక్షల వల్ల నిరంతరం తగ్గుతున్న సానుకూలత రేటు ఇప్పుడు 8 శాతం కంటే తక్కువకు పడిపోయింది. నాలుగు రోజుల క్రితం, 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పాజిటివ్‌ కేసుల నమోదు జాతీయ సగటు కంటే తక్కువగా ఉన్నాయి. ఇటీవలి రోజుల్లో భారతదేశం కొత్త కేసుల కంటే ఎక్కువ కొత్త రికవరీలను నమోదు చేస్తున్నది. ఫలితంగా క్రియాశీలక కేసులు క్రమంగా తగ్గుతున్నాయి.గత మూడు వారాల్లో దేశంలోని చాలా రాష్ట్రాల్లో కరోనా కేసులు, మరణాలు తగ్గాయని, అయితే చలిలో కరోనా యొక్క సెకండ్‌ వేవ్‌ను తోసిపుచ్చలేమని మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ సభ్యుడు, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు.

ప్రపంచంలోని ఇతర దేశాల కంటే భారతదేశం ఇంకా మెరుగైన స్థితిలో ఉన్నదని పాల్ చెప్పారు. అయితే 90 శాతం మంది ప్రజలు ఇప్పటికే కరోనా వైరస్ వ్యాధికి గురైనట్లు నిపుణులు చెప్తున్నారు. సెప్టెంబరు 17 న దేశంలో అత్యధిక సంఖ్యలో క్రియాశీల కేసులు 10.17 లక్షలు నమోదు కాగా, ఆ తరువాత ఆ సంఖ్య క్రమంగా తగ్గుతూ 7.83 లక్షలకు చేరుకున్నది. సుమారు 66 లక్షల మంది రోగులు కోలుకున్నారు.

Tags :
|
|

Advertisement