Advertisement

  • ప్రపంచంలో అత్యధిక పులులు ఉన్న దేశాల్లో భారత్ కు మొదటి స్థానం

ప్రపంచంలో అత్యధిక పులులు ఉన్న దేశాల్లో భారత్ కు మొదటి స్థానం

By: Sankar Wed, 29 July 2020 2:08 PM

ప్రపంచంలో అత్యధిక పులులు ఉన్న దేశాల్లో భారత్ కు మొదటి స్థానం



పులుల సంఖ్యలో భారత్‌ ప్రథమస్థానంలో ఉన్నది. ప్రపంచవ్యాప్తంగాఉన్న పులుల్లో సుమారు 75శాతం ఇక్కడే ఉన్నాయి. కేంద్రం 1972లో వన్యప్రాణి సంరక్షణ చట్టంచేసి అటవీ జంతువుల వేటను నిషేధించింది. ఈ చర్యలతో 1973లో 1,200 ఉన్న పులులసంఖ్య 1990 నాటికి 3,500కు చేరుకున్నది. అయితే క్రమంగా అడవుల విస్తీర్ణం తగ్గిపోవడంతో 60 శాతానికి పడిపోయింది. 2007 నాటికి 1,411 పులులు మాత్రమే మిగిలాయి.

ఈ నేపథ్యంలో 2006లో కేంద్రం నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ (ఎన్‌టీసీఏ) ప్రాజెక్టును చేపట్టి ప్రత్యేకసంరక్షణ చర్యలు తీసుకున్నది. అందులోభాగంగా నాలుగేండ్లకోసారి పులుల గణన నిర్వహిస్తున్నారు. దీంతో దేశంలో పులుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తున్నది. 2006లో 1,411 నుంచి 2010లో 1706కు, 2014లో 2226కు చేరాయి.

2018 నాటికి దేశంలోని యాభై టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌లలో వాటిసంఖ్య 2,967కు పెరిగిందిజ కేంద్రప్రభుత్వం పులుల గణన, సంరక్షణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నది. 2018లో సుమారు 141 సైట్లలో 26,760 ప్రాంతాల్లో కెమెరాలను ఏర్పాటుచేసింది. వాటిద్వారా సుమారు 76,523 ఫొటోలను సేకరించి పులుల సంఖ్యను నిర్ధారించారు. పులి పాదముద్రలు, వెంట్రుకలు, గోళ్లు, మలమూత్రాల ఆధారంగానూ వాటిసంఖ్యను నిర్ధారిస్తున్నారు.

Tags :
|
|
|
|

Advertisement