Advertisement

  • కుప్పకూలిన ఆసీస్ ...భారత్ కు తొలి ఇన్నింగ్స్ లో 53 పరుగుల కీలక ఆధిక్యం

కుప్పకూలిన ఆసీస్ ...భారత్ కు తొలి ఇన్నింగ్స్ లో 53 పరుగుల కీలక ఆధిక్యం

By: Sankar Fri, 18 Dec 2020 5:19 PM

కుప్పకూలిన ఆసీస్ ...భారత్ కు తొలి ఇన్నింగ్స్ లో 53 పరుగుల కీలక ఆధిక్యం


భారత్ , ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో భారత బౌలర్లు అనూహ్యంగా చెలరేగిపోయారు...కేవలం ఒకే ఒక్క డే అండ్ నైట్ టెస్ట్ ఆడిన అనుభవం ఉన్న భారత బౌలర్లు ఆస్ట్రేలియా బాట్స్మెన్ కు కట్టిపడేసారు..దీనితో ఆస్ట్రేలియా జట్టు తమ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 191 పరుగులకే కుప్పకూలింది..దీనితో టీమిండియా కీలక 53 పరుగుల ఆధిక్యం సంపాదించింది..

భారత బౌలర్లలో ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ గింగిరాలు తిరిగే బంతులతో ఆస్ట్రేలియా బాట్స్మెన్ ను ముప్పుతిప్పలు పెట్టాడు...కీలక స్మిత్ వికెట్ తో పాటు మరో మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి పతనాన్ని శాశించాడు..ఇక బుమ్రా , ఉమేష్ కూడా నిప్పులు చెరిగే బంతులతో ఇద్దరు కలిసి అయిదు వికెట్లు తీసుకున్నారు...

ఇక 53 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టులో పృథ్వీ షా మరొకసారి నిరాశపరిచాడు ..ఆచం తొలి ఇన్నింగ్స్ కు రిప్లయ్ లాగ రెండో ఇన్నింగ్స్ లో అవుట్ అయ్యాడు..ఇక రెండో రోజు ఆట ముగిసే సరికి టీమిండియా ఆరు ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి తొమ్మిది పరుగులు చేసింది ..క్రీజ్ లో మయాంక్ కు తోడు , నైట్ వాచ్ మెన్ బుమ్రా క్రీజ్ లో ఉన్నాడు...

Tags :
|
|
|
|

Advertisement