Advertisement

  • దేశంలో 75 లక్షలు దాటిన మొత్తం కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో 75 లక్షలు దాటిన మొత్తం కరోనా పాజిటివ్ కేసులు

By: Sankar Mon, 19 Oct 2020 10:32 AM

దేశంలో 75 లక్షలు దాటిన మొత్తం కరోనా పాజిటివ్ కేసులు


భారత్‌లో రోజువారి కరోనా కేసులు కాస్త తగ్గినా.. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మాత్రం.. రెండో రోజులకోసారి ఓ లక్ష మార్క్‌ క్రాస్ చేస్తూ పోతోంది... ఇప్పుడు 75 లక్షల మార్క్‌ను క్రాస్ చేసి.. 76 లక్షల వరకు పరుగులు పెడుతోంది..

కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 55,722 కొత్త కేసులు నమోదు కాగా.. 579 మంది మృతిచెందారు.. దీంతో.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 75,50,273కు పెరిగింది.. ప్రస్తుతం 7,72,055 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటి వరకు 66,63,608 మంది కరోనాబారినపడి కోలుకున్నారు..

గత 24 గంటల్లో 66,399 మంది రికవరీ అయ్యారు.. ఇక మృతుల సంఖ్య 1,14,610 పెరిగినట్టు కరోనా బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం... దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 88.26 శాతానికి పెరగగా.. యాక్టివ్ కేసుల శాతం 10.23గా ఉంది.. ఇక, మృతుల సంఖ్య 1.52 శాతానికి తగ్గిపోయింది.. మరోవైపు ఆదివారం రోజు దేశవ్యాప్తంగా 8,59,786 శాంపిల్స్‌ పరీక్షించారు.. ఇప్పటి వరకు మొత్తం 9,50,83,976 శాంపిల్స్ పరీక్షించినట్టు ఐసీఎంఆర్ ప్రకటించింది.

Tags :
|

Advertisement