Advertisement

  • దేశంలో 4 కోట్లు దాటిన కరోనా పరీక్షలు...తాజాగా 76,472 పాజిటివ్ కేసులు నమోదు

దేశంలో 4 కోట్లు దాటిన కరోనా పరీక్షలు...తాజాగా 76,472 పాజిటివ్ కేసులు నమోదు

By: Sankar Sun, 30 Aug 2020 09:30 AM

దేశంలో 4 కోట్లు దాటిన కరోనా పరీక్షలు...తాజాగా 76,472 పాజిటివ్ కేసులు నమోదు


భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణ ఆగడం లేదు. శనివారం తాజాగా మరో 76,472 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 34,63,972కు చేరుకుంది. గత 24 గంటల్లో 65,050 మంది కోలుకోగా 1,021 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 62,550కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 26,48,998కు చేరుకోగా, యాక్టివ్‌ కేసుల సంఖ్య 7,52,424గా ఉంది.

మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసుల శాతం 21.72గా ఉంది. యాక్టివ్‌ కేసుల కంటే 3.5 రెట్లు ఎక్కువగా కోలుకున్న కేసులు ఉండటం గమనార్హం. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోంది. బుధవారానికి ఇది 76.47 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు క్రమంగా తగ్గుతోందని ప్రస్తుతం 1.81 శాతానికి పడిపోయిందని తెలిపింది.

ఆగస్టు 28 వరకు 4,04,066,09 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది. శుక్రవారం మరో 9,28,761 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. రోజుకు పది లక్షల పరీక్షలు జరిపే దిశగా దేశం పయనిస్తోందని తెలిపింది. గత వారం రోజుల్లో నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి.

Tags :
|
|

Advertisement