Advertisement

  • దేశంలో మూడు కోట్లు దాటిన కరోనా పరీక్షలు.. గత 24 గంటల్లో 57,982 కొత్త కేసులు

దేశంలో మూడు కోట్లు దాటిన కరోనా పరీక్షలు.. గత 24 గంటల్లో 57,982 కొత్త కేసులు

By: Sankar Mon, 17 Aug 2020 11:00 AM

దేశంలో మూడు కోట్లు దాటిన కరోనా పరీక్షలు.. గత 24 గంటల్లో 57,982 కొత్త కేసులు


దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 57,982 కొత్త కేసులు నమోదడంతో మొత్తం కేసుల సంఖ్య 26 లక్షలు దాటింది. తాజాగా 941 మంది కరోనాతో మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 50,921 కి చేరింది. తాజాగా నమోదైనవాటితో కలిపి మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 26,47,664 కు చేరింది.

ప్రస్తుతం 6,76,900 మంది వైరస్‌ బాధితులు చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 19,19,843 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 7 లక్షల 30 వేల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడంతో.. మొత్తం పరీక్షల సంఖ్య మూడు కోట్లు దాటింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సోమవారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

కాగా ప్రస్తుతం ప్రపంచం లో అత్యధిక కరోనా కేసులతో అమెరికా మొదటి స్థానంలో ఉండగా , ఆ తర్వాత రెండో స్థానంలో బ్రెజిల్ ఉంది ..ఇక మూడో స్థానంలో ఇండియా ఉంది..అయితే ఒక్క రోజు కరోనా కేసుల్లో మాత్రం ఇండియానే ముందు స్థానంలో ఉంది


Tags :
|
|
|
|

Advertisement