Advertisement

  • దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు ..5 కోట్లు దాటిన కరోనా పరీక్షలు

దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు ..5 కోట్లు దాటిన కరోనా పరీక్షలు

By: Sankar Wed, 09 Sept 2020 10:19 AM

దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు ..5 కోట్లు దాటిన కరోనా పరీక్షలు


భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది.. నిన్న కాస్త తగ్గినట్టుగా కనిపించిన కరోనా కేసులు.. ఇవాళ మళ్లీ భారీగా పెరిగాయి.. ఒకే రోజు 90 వేలకు చేరువయ్యాయి... మరోవైపు.. పాజిటివ్ కేసుల సంఖ్య 43 లక్షల మార్క్‌ను కూడా క్రాస్‌ చేసింది... కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో అత్యధికంగా రికార్డుస్థాయిలో 89,706 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి... ఇక, 1,115 మంది మృతిచెందారు.. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 43,70,129కు చేరింది... ఇప్పటి వరకు 73,890 మంది కరోనాతో మృతిచెందారు..

మరోవైపు.. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 74,894 మంది కోలుకున్నట్టు కేంద్రం ప్రకటించింది.. ప్రస్తుతం దేశంలో యాక్టీవ్ కేసులు 8,97,394గా ఉండగా.. ఇప్పటి వరకు కరోనాబారినపడి 33,98,884 మంది కోలుకున్నారు. కరోనా రికవరీ రేటు 77.77 శాతానికి పెరిగినట్టు ప్రభుత్వం పేర్కొంది. యాక్టివ్ కేసులు 20.53 శాతంగా ఉండగా.. కోవిడ్ మరణాలు 1.69 శాతానికి తగ్గిపోయాయి..

ఇప్పటి వరకూ దేశంలో దాదాపు 5 కోట్ల పరీక్షలు చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గత రెండు వారాల్లోనే దాదాపు 1.33 కోట్లకు పైగా పరీక్షలు చేసినట్లు పేర్కొంది. తాజా 1,016 మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 423 మంది మరణించారు. మొత్తం మరణాల్లో కూడా మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. తర్వాతి స్థానాల్లో తమిళనాడు, కర్ణాటకలు ఉన్నాయి. కేంద్ర రాష్ట్రాలు సమన్వయంతో పని చేస్తుండటంతో కరోనాను కట్టడి చేయగలుగుతున్నామని, టెస్ట్, ట్రాక్, ట్రీట్‌ అనే త్రిముఖ వ్యూహంతో ముందుకెళుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

Tags :
|

Advertisement