Advertisement

దేశంలో 30 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

By: Sankar Sun, 23 Aug 2020 10:17 AM

దేశంలో 30 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు


కరోనా పాజిటివ్‌ కేసులు దేశవ్యాప్తంగా అంతకంతకూ పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 70,400 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 30 లక్షలు దాటింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 30,44,941 కు చేరింది.

తాజాగా 912 మంది వైరస్‌ బాధితులు ప్రాణాలు విడువడంతో ఆ సంఖ్య 56,706 కు చేరింది. 57,989 మంది కోవిడ్‌ పేషంట్లు శనివారం కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 22,80,567 కు చేరింది. ప్రస్తుతం 7,07,668 యాక్టివ్‌ కేసులున్నాయి. ఈ మేరకు కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ ఆదివారం హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 74.69 శాతంగా ఉందని తెలిపింది. మరణాల రేటు 1.87 శాతంగా ఉందని వెల్లడించింది.

శనివారం అత్యధికంగా మహారాష్ట్రలో 14,492 మందికి వైరస్ నిర్ధారణ కాగా.. యూపీ (5,375), తెలంగాణ (,2474), గుజరాత్ (1,212), మధ్యప్రదేశ్ (1,226) ఒక్క రోజు గరిష్ఠ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో మొత్తం బాధితుల సంఖ్య 6,71,942గా ఉంది. మహరాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో పాజిటివ్ కేసులు మరోసారి 10వేలు దాటాయి. 13 రోజుల తర్వాత 10వేల కేసులు శనివారం నిర్ధారణ అయ్యాయి. దీంతో ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య 3,45,216కి చేరింది.

Tags :
|
|

Advertisement