Advertisement

  • కరోనా కేసుల్లో భారత్ రికార్డు ..ప్రపంచంలో తొలిసారిగా 80 వేలు దాటిన ఒక్క రోజు కరోనా కేసులు..

కరోనా కేసుల్లో భారత్ రికార్డు ..ప్రపంచంలో తొలిసారిగా 80 వేలు దాటిన ఒక్క రోజు కరోనా కేసులు..

By: Sankar Thu, 03 Sept 2020 10:38 AM

కరోనా కేసుల్లో భారత్ రికార్డు ..ప్రపంచంలో తొలిసారిగా 80  వేలు దాటిన ఒక్క రోజు కరోనా కేసులు..


భారత్‌లో కరోనా కల్లోలం కొనసాగుతోంది... ఒకటితో ప్రారంభమై... పదులు, వందలు, వేలు ఇలా పెరుగుతూనే వస్తున్నాయి కేసులు... ఇక, 50 వేల మార్క్‌ను కూడా క్రాస్ చేసే చాలా రోజులే అయిపోయింది.. వరుసగా... 70వేల పైన పాజిటివ్ కేసులు నమోదు అవుతూ వస్తుండగా... 80 వేల మార్క్‌ను కూడా క్రాస్ చేసి కొత్త రికార్డు సృష్టించాయి...

కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం... గడచిన 24 గంటల్లో అత్యధికంగా 83,883 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి... 1,043 మంది మృతిచెందారు... దీంతో... దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 38,53,407కు చేరుకోగా... ఇప్పటివరకు మొత్తం 67,376 మంది మృతిచెందారు.. ప్రస్తుతం దేశంలో 8,15,538 యాక్టివ్ కేసులు ఉన్నాయని... ఇప్పటి వరకు కరోనాబారినపడి 29,704,93 మంది కోలుకున్నారని ప్రకటించింది కేంద్రం.

కాగా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసుల లిస్టులో అమెరికా మొదటి స్థానంలో ఉండగా , ఆ తర్వాత స్థానంలో బ్రెజిల్ , మూడో స్థానంలో ఇండియా ఉన్నాయి ..అయితే ఒక్కరోజు కరోనా కేసుల్లో మాత్రం ఇండియా ముందు స్థానంలో ఉండటం తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తుంది..కేసులు ఇలానే నమోదు అయితే రోజుకి లక్ష కరోనా కేసులు వచ్చే రోజులు అది దగ్గర్లోనే ఉన్నట్లు అనిపిస్తుంది..

Tags :
|
|

Advertisement