Advertisement

  • దేశంలో క్రమక్రమంగా పెరుగుతున్న కరోనా రికవరీ రేట్ ..

దేశంలో క్రమక్రమంగా పెరుగుతున్న కరోనా రికవరీ రేట్ ..

By: Sankar Tue, 25 Aug 2020 09:17 AM

దేశంలో క్రమక్రమంగా పెరుగుతున్న కరోనా రికవరీ రేట్ ..


దేశంలో కరోనా మహమ్మారి ఇంకా తగ్గుముఖం పట్టలేదు..రోజు రోజుకి కేసులు బారి స్థాయిలో నమోదు అయితూనే ఉన్నాయి..తాజాగా ఇండియాలో సోమవారం మరో 61,408 కోవిడ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 31,06,348కు చేరుకుంది. కరోనా కేసులు 30 లక్షల నుంచి 31 లక్షలకు కేవలం ఒక్క రోజులోనే చేరుకున్నాయి.

24 గంటల్లో 57,469 మంది కోలుకోగా, 836 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 57,542కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 23,38,035కు చేరుకోగా, యాక్టివ్‌ కేసుల సంఖ్య 7,10,771గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసుల శాతం 22.88గా ఉంది.

యాక్టివ్‌ కేసుల కంటే మూడు రెట్లు కోలుకున్న కేసులు ఉండటం గమనార్హం. దేశంలో కరోనా రికవరీ రేటు 75.27 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.85 శాతానికి పడిపోయిందని తెలిపింది. ఆగస్టు 22 వరకు 3,52,92,220 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది. శనివారం మరో 8,01,147 శాంపిళ్లను పరీక్షించినట్లు చెప్పింది. ఆదివారం మరో 6,09,917 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. ఇప్పటి వరకూ నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 3,59,02,137 కు చేరింది. పరీక్షల్లో వస్తున్న పాజిటివిటీ రేటు 8% కంటే తక్కువగా ఉంది.

Tags :
|
|
|
|
|

Advertisement