Advertisement

  • చివరిదశ ట్రయల్స్ లో భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ కోవాక్జిన్

చివరిదశ ట్రయల్స్ లో భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ కోవాక్జిన్

By: chandrasekar Wed, 12 Aug 2020 8:41 PM

చివరిదశ ట్రయల్స్ లో భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ కోవాక్జిన్


కరోనా వైరస్ పై పోరాటంలో భారత్ బయోటెక్, ఐసీఎంఆర్ సంస్థలు సంయుక్తంగా డెవలప్ చేస్తున్న వ్యాక్సిన్ కోవాక్జిన్. ఇప్పటికే భారత్ లో ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ మొదలు కాగా. హైదరాబాద్ నిమ్స్ లోనూఈ ట్రయల్స్ జరుగుతున్నాయి. నిమ్స్‌తో పాటు దేశవ్యాప్తంగా 12 ఆసుపత్రుల్లో ఈ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. గత కొంతకాలంగా జరుగుతున్న ఈ పరీక్షలు చివరి దశకు చేరుకున్నాయి. కరోనా వ్యాక్సిన్ తయారీలో భాగంగా నిమ్స్‌లో చేపట్టిన ఫస్ట్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ చివరి దశకు చేరుకుంది. మొదటి దశ క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా వాలంటీర్లకు వైద్య బృందం బూస్టర్ డోస్ ఇచ్చింది. నిన్న 11 మంది వాలంటీర్లకు నిమ్స్ వైద్య బృందం బూస్టర్ డోస్ ఇచ్చింది. ఇవాళ మరో పదిమంది వాలంటీర్లకు బూస్టర్ డోస్‌ను మెడికల్ టీమ్ ఇవ్వనుంది

కోవాక్జిన్ మొదటి దశ ప్రయోగాలను పూర్తి చేసుకొని రెండో దశలోనూ మెరుగైన ఫలితాలను చూపించినట్లు నిమ్స్ వర్గాలంటున్నాయి. ఫస్ట్ ఫేజ్ లో 50మందికి కోవాక్జిన్ ఫస్ట్ డోస్ ఇవ్వగా, అందరి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని తేలింది. అందులో 14 రోజులు గడిచిన వారిలో కొందరిని ఎంపిక చేసి నిర్ధారిత సమయాల్లో బూస్టర్‌ డోస్‌ ఇస్తున్నారు. అందరి ఆరోగ్య పరిస్థితిని వీడియో కాల్‌ ద్వారా ప్రతి రోజూ వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. వ్యాక్సిన్‌ ఇచ్చిన తర్వాత 24 గంటలపాటు ఆస్పత్రిలోనే ఉంచి ఆరోగ్యం నిలకడగా ఉంటేనే ఇళ్లకు పంపిస్తున్నారు.

దీంతో రెండో ఫేజ్ లో భాగంగా ఇప్పటి వరకు ఎడుగురికి రెండో దశలో బూస్టర్ డోస్ ఇచ్చినట్లు నిమ్స్ వర్గాలు తెలిపాయి. వీరిని 24గంటల పాటు ఆసుపత్రిలోనే వైద్యుల పర్యవేక్షణ ఉంచుకొని ఆ తర్వాత ఇంటికి పంపిస్తున్నామని, రోజు వీడియో కాల్ ద్వారా మానిటర్ చేస్తున్నట్లు నిమ్స్ ఆసుపత్రి తెలిపింది. రెండో డోసు తీసుకున్న ఏడుగురితో కలిపి మొదటి డోసు వేసుకున్న వారందరి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్య బృందం నిర్ధారించుకుంది. ఎవరిలోనూ ఇతర ఇబ్బందులు లేవని ఆసుపత్రి పేర్కొంది.

Tags :
|

Advertisement