Advertisement

  • చైనాకు చెక్ పెట్టేందుకు ఆస్ట్రేలియా తో ఇండియా కీలక ఒప్పందాలు

చైనాకు చెక్ పెట్టేందుకు ఆస్ట్రేలియా తో ఇండియా కీలక ఒప్పందాలు

By: Sankar Thu, 04 June 2020 4:37 PM

చైనాకు చెక్ పెట్టేందుకు ఆస్ట్రేలియా తో ఇండియా కీలక ఒప్పందాలు

భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ గురువారం వర్చువల్ సమ్మిట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఏడు ఒప్పందాలు కుదిరాయి. మోదీ మాట్లాడుతూ.. కరోనా సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుందాం అని ఆస్ట్రేలియా ప్రధానికి పిలుపునిచ్చారు. హిందూ మహాసముద్రంలో చైనా యుద్ధ నౌకల ప్రాబల్యం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో.. ఇండో-పసిఫిక్ రీజియన్‌లో కలిసి పని చేసే విషయమై ఇరు దేశాలు ఓ అవగాహనకు వచ్చాయి.

రవాణా సహాయం కోసం ఒక దేశానికి చెందిన సైనిక స్థావరాలను మరో దేశం ఉపయోగించుకోవడానికి భారత్, ఆస్ట్రేలియా అంగీకరించాయి. ఈ ప్రాంతంలో చైనా ఆర్థిక, సైనిక ప్రాబల్యం పెరుగుతున్న నేపథ్యంలో.. అమెరికాతోనూ భారత్ ఇలాంటి ఒప్పందాన్నే చేసుకుంది.

india,australia,china,modi,virtualmeeting , భారత్ , ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని , స్కాట్ మారిసన్ , వర్చువల్ సమ్మిట్‌

ఆస్ట్రేలియా నుంచి ఎక్కువ మొత్తంలో ఎగుమతులు చైనాకు వెళ్తున్నాయి. కానీ ఇరు దేశాల మధ్య ఇటీవలి కాలంలో వాణిజ్య ఘర్షణలు తలెత్తుతున్నాయి. చైనాలో కరోనా ఎలా పుట్టింది, వ్యాప్తి చెందిందనే విషయాన్ని సమీక్షించాలని ఆస్ట్రేలియా కూడా డిమాండ్ చేసింది.

కరోనా వైరస్ ప్రభావం ఆర్థిక రంగం, సమాజంపై తీవ్రంగా ఉన్న నేపథ్యంలో భారత్, అమెరికా కలిసి ముందుకు సాగాలని, పరస్పరం సహకరించుకోవాలని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. వర్చువల్ సమ్మిట్‌ను భారత్-ఆస్ట్రేలియా భాగస్వామ్యంలో నూతన మోడల్‌గా, వాణిజ్య నిర్వహణలో నూతన మోడల్‌గా మోదీ అభివర్ణించారు. ఓ విదేశీ నేతతో ద్వైపాకిక్ష చర్చలను వర్చువల్‌గా నిర్వహించడం ఇదే తొలిసారి కాగా.. మారిసన్‌తో చర్చలు అద్భుతంగా జరిగాయని మోదీ తెలిపారు.

Tags :
|
|
|

Advertisement