Advertisement

  • మైత్రి బలపరుచుకోవడం కోసం ఇండియా -జపాన్ దేశాల నావికా విన్యాసాలు

మైత్రి బలపరుచుకోవడం కోసం ఇండియా -జపాన్ దేశాల నావికా విన్యాసాలు

By: Sankar Sun, 28 June 2020 7:33 PM

మైత్రి బలపరుచుకోవడం కోసం ఇండియా -జపాన్ దేశాల నావికా విన్యాసాలు



ఇండియా చైనా మధ్య సంఘర్షణల జరుగుతున్న నేపథ్యంలో ఎప్పుడు యుద్ధం వస్తుందో అని రెండు దేశాల ప్రజలు అనుకుంటున్నారు ..అయితే ఒకవైపు యుద్ధం ముంచుకొస్తుంటే ,మరోవైపు ఇండియా తన మిత్ర దేశాలతో సంబంధాలను పెపొందించుకునే పనిలో పడింది ..మొన్నటికి మొన్న అమెరికా ..జర్మనీ లో ఉన్న తమ సైన్యాన్ని ఉపసంహరించుకున్నాయి ..ఇప్పుడు ఇండియా , జపాన్ లు సైనిక విన్యాసాలు నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. హిందూ మహాసముద్రంలో జపాన్‌కు చెందిన రెండు యుద్ద నౌకలు, మన దేశ యద్ద నౌకలు రెండు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి.

దీనికి సంబంధించిన వివరాలను భారత నావికాదళ వైస్ అడ్మైరల్ ప్రదీప్ చౌహాన్ వెల్లడించారు. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ఈ విన్యాసాలు ఉపయోగపడతాయని తెలిపారు. అయితే ఈ విన్యాసాలు యుధ్ధం చేసేందుకు కాదని, కేవలం తమ బలాన్ని తెలియజెప్పేందుకేనని అన్నారు. ‘మిత్ర దేశాలతో స్నేహాన్నిపెంపొందించుకోవడంతో పాటు సహాయసహకారాలను ఇచ్చిపుచ్చుకోవడానికి భారత్ ఎప్పుడూ ముందుంటుంది. అంతేకాకుండా అమెరికా, జపాన్‌ల మధ్య భారత్ ఓ పటిష్ఠమైన వారధిలా ఉందన్న విషయం చైనాకు అర్థమవ్వాలి.

అందుకే ఈ విన్యాసాలు నిర్వహిస్తున్నాం అని చౌహాన్ పేర్కొన్నారు. ఈ విన్యాసాలపై జపాన్ నావికాదళం కూడా స్పందించింది. రెండు దేశాల మధ్య మైత్రీబంధాన్ని బలపరుచుకునేందుకు, పరస్పర అవగాహన పెంచుకునేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని అభిప్రాయపడింది. ఇదిలా ఉంటే భారత్, జపాన్ దేశాలు సాధారణంగానే నావికాదళ విన్యాసాలు నిర్వహిస్తూ ఉంటాయి. అయితే ప్రస్తుతం ఈ రెండు దేశాలతోనూ చైనాకు సరిహద్దు వివాదం నడుస్తోంది. ఇలాంటి తరుణంలో యుద్ధ నౌకలతో విన్యాసాలు నిర్వహిచడం చర్చనీయాశం అవుతోంది.

Tags :
|
|
|
|

Advertisement