Advertisement

  • నామినేషన్ వేయడానికి గేదెపై వచ్చిన ఇండిపెండెంట్ అభ్యర్థి...?

నామినేషన్ వేయడానికి గేదెపై వచ్చిన ఇండిపెండెంట్ అభ్యర్థి...?

By: chandrasekar Tue, 20 Oct 2020 12:41 PM

నామినేషన్ వేయడానికి గేదెపై వచ్చిన ఇండిపెండెంట్ అభ్యర్థి...?


బీహార్ ఎన్నికల వేడి మొదలవడంతో రాజకీయ నాయకులు ప్రచారంలో మునిగితేలుతున్నారు. తమ ప్రత్యర్థుల కన్నా తము ఎంత బెటరో చెప్పడానికి దిగ్గజ నేతలు ఏ అవకాశం వదలడం లేదు. అదే సమయంలో ఎన్నికల సమయంలో కనిపించే సాధారణ అంశాలతో పాటు ఈ సారి కొత్త చిత్రాలు కూడా ముందుకు వస్తున్నాయి. దానికి నిదర్శనమే ఇది. ఈ ఫోటలో కనిపిస్తున్న వ్యక్తి పేరు నాచారీ మండల్. బీహార్ రాష్ట్రంలోని బహాదుర్పూర్ నియోజక వర్గంలోని దర్భంగా నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాడు.

ఎన్నికల్లో పోటీలో దిగడానికి ముందు ఇతను తన నామినేషన్ వేయడానికి ఇలా గేదెపై బయల్దేరాడు. ఈ ఫోటో ఇప్పుడు దేశ వ్యాప్తంగా బాగా వైరల్ అవుతోంది. ప్రజలను ఆకర్షించడానికి రాజకీయ నాయకులు ఎంత కష్టపడతారో చూడండి అని కొంత మంది నెటిజెన్స్ ఈ ఫోటోను చూసి కామెంట్ పెట్టారు. అయితే నిజం మాత్రం వేరేలా ఉంది అనేది అతని చెప్పింది వింటే అర్థం అవుతుంది. అయితే దీని గురించి స్పందించిన నాచారీ మాత్రం తను ఒక వెనకబడిన వర్గానికి చెందిన వ్యక్తిని అని సాధారణ రైతును అని చెప్పారు. ఇతర నేతల్లా తనకు కార్లు లేవు అని అందుకే ఇలా గేదెపై వచ్చాను అని తెలిపాడు. కారణం ఏది అయినా అతని నామినేషన్ దాఖలు చేసే విధానం చాలా మందికి కొత్తగా అనిపించింది.

Tags :

Advertisement