Advertisement

  • విజయవాడలో ఘనంగా జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

విజయవాడలో ఘనంగా జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

By: chandrasekar Sat, 15 Aug 2020 4:50 PM

విజయవాడలో ఘనంగా జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు


విజయవాడలో స్వాంతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన వేడుకల్లో ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సీఎం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు పాల్గొన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ వేడుకలను ఏర్పాటు చేశారు. అధికారులు భౌతిక దూరం, మాస్కులు వంటి జాగ్రత్తలు తీసుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఏపీలో శనివారం ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా శాసనసభా ప్రాంగణంలో స్పీకర్ తమ్మినేని సీతారాం జాతీయ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో అసెంబ్లీ సెక్రటరీ బాలకృష్ణమాచార్యులు, అసెంబ్లీ ఉద్యోగులు పాల్గొన్నారు.

శాసన మండలి ఆవరణలో మండలి చైర్మన్ షరీఫ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సచివాలయ ఆవరణలో సీఎస్‌ నీలం సాహ్ని జాతీయ జెండాను ఎగుర వేశారు. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయ కల్లమ్‌ జాతీయ జెండా ఆవిష్కరించారు.

74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భారతీయులకు ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.' ఈరోజు మనం ఆనందించే స్వేచ్ఛను బహుమతిగా ఇచ్చిన వీరులకు నా శతకోటి వందనాలు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగాలను అర్పించి దేశ భక్తిని మరింత పెంపొందించారు. మన దేశం విలువలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దేశ ప్రతిష్టను రక్షించడానికి ప్రతిజ్ఞ చేద్దాం.. దాని పురోగతికి దోహదం చేద్దాం. జై హింద్!' అంటూ ట్వీట్ చేశారు.

Tags :

Advertisement