Advertisement

రెండు నగారాల్లో నిరవధిక క‌ర్ఫ్యూ

By: chandrasekar Mon, 05 Oct 2020 11:48 AM

రెండు నగారాల్లో నిరవధిక క‌ర్ఫ్యూ


దివులపిటియాలో ఆదివారం కరోనా రోగిని గుర్తించ‌డంతో కొలంబో శివారులోని దివులపిటియా, మిన్వాంగోడ పట్టణాల్లో నిరవధిక కర్ఫ్యూ విధించినట్లు ఆర్మీ కమాండర్‌, కరోనా నివారణ టాస్క్ ఫోర్స్ హెడ్ శవేంద్ర సిల్వా పేర్కొన్నారు.

వస్త్ర కర్మాగారంలో పనిచేసే దివులపిటియాకు చెందిన ఒక మహిళ జ్వరంతో బాధ‌ప‌డుతుంది. చికిత్స నిమిత్తం గంపాలోని ఆసుపత్రిలో చేరింది. ప‌రీక్ష‌లో క‌రోనా వైర‌స్ పాజిటివ్‌గా నమోదైంది. దీంతో త‌న‌తో పాటు ప‌నిచేసే సుమారు 50 మందిని హోం ఐసోలేష‌న్‌కి పంపారు. ఏప్రిల్ అనంత‌రం కరోనా క‌మ్యూనిటీ కేసును క‌నుగొన‌డం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు.

శ్రీలంక ప్రభుత్వం రెండు నెలలుగా కమ్యూనిటీ సంక్రమణకు లేనందున విధించిన కర్ఫ్యూను జూన్ 28న పూర్తిగా ఎత్తివేసింది. మార్చి 20 నుండి శ్రీ‌లంక‌లో నిరంత‌ర లాక్‌డౌన్ ప్ర‌క్రియ కొన‌సాగుతుంది. అనంత‌రం దేశంలో మూడింట రెండొంతుల వ‌ర‌కు స‌డ‌లించారు. ఆపై క‌ర్ఫ్యూని రాత్రి వేళ‌కు మాత్ర‌మే ప‌రిమితం చేశారు. మే నెల‌లో కార్యాల‌యాలు, వ్యాపారాల‌కు పాక్షికంగా అనుమ‌తి తెలిపారు. జూన్ ఆరంభం నుండి ప్ర‌జా ర‌వాణాకు అనుమ‌తి ఇస్తూ ఆంక్ష‌లను మ‌రింత స‌డ‌లించారు.

Tags :
|
|

Advertisement