Advertisement

  • ఏపీ లో రోజురోజుకి పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

ఏపీ లో రోజురోజుకి పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

By: chandrasekar Thu, 03 Sept 2020 5:02 PM

ఏపీ లో రోజురోజుకి పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు


ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు రోజుకు కనీసం 10వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 10,392 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 455531 కి చేరింది. అయితే, కోవిడ్ మరణాల సంఖ్య కొంచెం తగ్గింది. గత కొన్ని రోజులుగా 80, 90కి పైగా కరోనా మరణాలు నమోదవుతుండగా, గడిచిన 24 గంటల్లో 72 మంది చనిపోయినట్టు ప్రభుత్వం తెలిపింది.

నెల్లూరులో 11, చిత్తూరు 10, పశ్చిమ గోదావరి 9, ప్రకాశం 8, కృష్ణా 6, విశాఖపట్నం 6, అనంతపురం 4, తూర్పుగోదావరి 4, గుంటూరు 4, శ్రీకాకుళం 4, విజయనగరం 3, కడప 2, కర్నూలు జిల్లాలో ఒకరు కోవిడ్తో చనిపోయారు. దీంతో కలిపి రాష్ట్రంలో మొత్తం ఇప్పటి వరకు కోవిడ్ తో మరణించిన వారి సంఖ్య 4125కి చేరింది. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1199 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, చిత్తూరు జిల్లాలో కూడా 1124 కేసులు రికార్డయ్యాయి.

నెల్లూరు 942, గుంటూరులో 900, పశ్చిమ గోదావరి 885, అనంతపురంలో 810, కడప 800, ప్రకాశం 800, కర్నూలు 697, విశాఖపట్నం 675, శ్రీకాకుళం 603, విజయనగరం 560, కృష్ణా 397 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 455531 కాగా, ప్రస్తుతం 103076 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 348330 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4125.

ఆంధ్రప్రదేశ్‌లో 24 గంటల్లో 60,804 కోవిడ్ టెస్టులు నిర్వహించగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు 38,43,550 కరోనా శాంపిల్స్ పరీక్షించింది ప్రభుత్వం. ఏపీలో గడిచిన 24 గంటల్లో 8,454 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో అత్యంత ఎక్కువ కోవిడ్ టెస్టులు చేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ మూడో స్థానంలో ఉంది. తమిళనాడు (4888312 ), మహారాష్ట్ర ( 4212148 ) తర్వాత ఏపీ ( 3843550 ) లోనే అత్యంత భారీగా కోవిడ్ టెస్టులు చేస్తున్నారు. అయితే, దేశంలో కోవిడ్ కేసుల్లో మాత్రం ఏపీ రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో మహారాష్ట్ర ( 808306 ), ఆ తర్వాత స్థానంలో ఏపీ ( 455531 ) ఉండగా, మూడో ప్లేస్‌లో తమిళనాడు (433969 ) ఉంది.

Tags :
|
|

Advertisement