Advertisement

  • మైక్రో ఫైనాన్స్ వాళ్ళు ఇబ్బంది పెడితే ఫిర్యాదు చేయాలి ..తెలంగాణ పోలీసులు

మైక్రో ఫైనాన్స్ వాళ్ళు ఇబ్బంది పెడితే ఫిర్యాదు చేయాలి ..తెలంగాణ పోలీసులు

By: Sankar Sun, 20 Dec 2020 5:51 PM

మైక్రో ఫైనాన్స్ వాళ్ళు ఇబ్బంది పెడితే ఫిర్యాదు చేయాలి ..తెలంగాణ పోలీసులు


తెలంగాణలో రోజు రోజుకు మైక్రోఫైనాన్స్ యాప్ ప్రతినిధుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. డబ్బులు చెల్లించని వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నాయి మైక్రో ఫైనాన్స్.

డబ్బులు తీసుకున్న వారి మహిళా బంధువులకు ఫోన్ చేసి అసభ్యకర రీతిలో మాట్లాడుతున్నారు మైక్రో ఫైనాన్స్ ఆప్స్ ప్రతినిధులు. డబ్బులు ఇవ్వకపోతే మహిళలను పంపించాలంటూ మైక్రోఫైనాన్స్ ఆప్స్ ప్రతినిధులు వేధిస్తున్నారు. తీసుకున్న డబ్బుల కిందకు మహిళల్ని పంపించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

హైదరాబాద్ నగరంలో వందల సంఖ్యలో మైక్రోఫైనాన్స్ ప్రతినిధుల పై వందల కేసులు నమోదయ్యాయి. డబ్బులు తీసుకున్న వారిని ఫోన్లో భయంకరంగా వేధిస్తున్నారు మైక్రోఫైనాన్స్ ప్రతినిధులు. ఇది ఇలా ఉండగా... మైక్రోఫైనాన్స్‌ ప్రతినిధులు ఇబ్బందులు పెడితే.. ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.

Tags :
|

Advertisement