Advertisement

  • ఆఫీస్ లో కంటే ఇంటి దగ్గరి నుంచే పెరుగుతున్న ఉత్పాదకత

ఆఫీస్ లో కంటే ఇంటి దగ్గరి నుంచే పెరుగుతున్న ఉత్పాదకత

By: Sankar Sun, 02 Aug 2020 08:10 AM

ఆఫీస్ లో కంటే ఇంటి దగ్గరి నుంచే పెరుగుతున్న ఉత్పాదకత



కరోనా మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని కంపెనీలు కూడా వర్క్ ఫ్రొం హోమ్ విధానాన్ని అవలంబిస్తున్నాయి ..అయితే ఆఫీస్ కి వెళితే ఒక నిర్ణిత సమయం మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది కానీ ఇంటి దగ్గరి నుంచి పని అంటే ప్రత్యేక టైం అంటూ ఉండదు ..ఇచ్చిన పని అయిపోయేదాకా ఉద్యోగులు పని చేస్తున్నారు ..దీనితో ఆఫీస్ కి వెళ్లి చేసిన ఉత్పాదకత కంటే వర్క్ ఫ్రొం హోమ్ విధానం వలన ఉత్పాదకత గణనీయంగా పెరిగిపోయింది ..

తొలుత ఇదొక తాత్కాలిక చర్య మాత్రమే అనుకున్నప్పటికీ... ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభణ తో ఇకపై వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం పర్మనెంట్ అయ్యేలా ఉందని కంపెనీలు, విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రతి విధానంలోనూ ఉన్నట్లే వర్క్ ఫ్రమ్ హోమ్ లోనూ మంచి, చెడు మిళితమై ఉన్నాయి..

అయినా సరే ఇందులో ఉన్న ప్రయోజనాల దృష్ట్యా కంపెనీలు ఈ విధానానికి ఆసక్తి చూపుతున్నట్లు స్పష్టమవు తున్నది. ఐటీ కంపెనీలు కాకుండా తయారీ రంగంలో ఉన్న ఫిలిప్స్ లాంటి కంపెనీలు సైతం ఈ విధానానికి జై కొడుతుండటం విశేషం. కేవలం 15శాతం మందిని మాత్రమే ఆఫీస్ కు వచ్చి పని చేసేందుకు అనుమతిస్తున్నది. ప్రస్తుతం దేశంలో కోవిడ్ -19 తీవ్రత అధికంగా ఉండటంతో ఉద్యోగుల భద్రత, ఆరోగ్యం వంటి కీలక అంశాలను దృష్టిలో ఉంచుకుని కంపెనీలు ఈ చర్యలకు ప్రాధాన్యమిస్తున్నాయి.

ఎక్కువ మంది ఆఫీస్ కు వచ్చి పనిచేస్తే వైరస్ వ్యాప్తికి అవకాశాలు ఉంటాయి కాబట్టివర్క్ ఫ్రమ్ హోమ్ మాత్రమే బెటర్ అని భావిస్తున్నాయి. ఒకవైపు కరోనా రాకుండా చూసుకుంటూనే, మరో వైపు బిజినెస్ దెబ్బతినకుండా పనిచేసేందుకు ఈ విధానం చాలా మెరుగ్గా ఉండటం వల్ల ఇక మీదట దీనిని పర్మనెంట్ చేయాలని పలు కంపెనీలు భావిస్తున్నాయి.

Tags :
|
|
|

Advertisement