Advertisement

  • ఆంధ్రప్రదేశ్ ‌లో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు

ఆంధ్రప్రదేశ్ ‌లో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు

By: chandrasekar Tue, 23 June 2020 11:03 AM

ఆంధ్రప్రదేశ్ ‌లో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు


రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సోమవారం బులెటిన్ విడుదల చేయగా, మొత్తం 443 కేసులు నమోదయ్యాయి. వీరిలో రాష్ట్రానికి చెందిన వారు 392 మంది కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 44 మంది, విదేశాల నుంచి వచ్చిన వారు 7 మంది ఉన్నారు.

గడిచిన 24 గంటల్లో 16,704 మంది శాంపిల్స్ పరీక్షించగా 392 మంది కోవిడ్ 19 పాజిటివ్‌గా తేలారు. 83 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 7,451 నమోదు కాగా, 3,437 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం వివిధ కోవిడ్‌ ఆస్పత్రుల్లో 3,903 మంది చికిత్స పొందుతున్నారు.

కరోనా వైరస్ కారణంగా గడిచిన 24 గంటల్లో ఐదుగురు మరణించారు. వీరిలో కృష్ణా జిల్లాలో ఒకరు, కర్నూలు జిల్లాలో ఒకరు, అనంతపురంలో ఒకరు, పశ్చిమ గోదావరిలో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 111కు పెరిగింది. అలాగే పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 9,372 కేసులు నమోదయ్యాయి. వీరిలో 4,435 మంది డిశ్చార్జి కాగా, 4,826 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అలాగే రెండు జిల్లాలో కరోనా కేసులు వెయ్యి దాటాయి. కర్నూలు జిల్లాలో 1354, కృష్ణా జిల్లాలో 1,063 కేసులు నమోదయ్యాయి.

Tags :
|

Advertisement