Advertisement

  • కరోనా టెస్టుల సంఖ్యను పెంచుతున్నాం..ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్

కరోనా టెస్టుల సంఖ్యను పెంచుతున్నాం..ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్

By: Sankar Mon, 16 Nov 2020 07:16 AM

కరోనా టెస్టుల సంఖ్యను పెంచుతున్నాం..ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్


ఢిల్లీలో కోవిడ్ రోగుల కోసం 750 పడకలను సిద్డం చేయడానికి కేంద్రం ఏర్పాట్లు చేస్తోందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. కేవలం 2 రోజుల్లో ఇవి పూర్తవుతాయని అన్నారు.

హోం మంత్రి అమిత్ షాతో అత్యవసరంగా సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. గత నెల 20 నుంచి నగరంలో కరోనా వైరస్ కేసులు పెరిగాయని, కానీ ఐ సీ యూ బెడ్స్ తగినన్ని లేవని అన్నారు. డీ ఆర్ డీ ఓ సెంటర్ లో 750 ఐ సీ యూ బెడ్స్ ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందన్నారు. రోజూ నిర్వహిస్తున్న కరోనా టెస్టుల సంఖ్యను ప్రస్తుతమున్న 60 వేల నుంచి లక్షకు పెంచుతామని కేజ్రీవాల్ వెల్లడించారు.

ఈ నెలారంభం నుంచి ఢిల్లీలో ఇన్ఫెక్షన్స్ మరింతగా పెరుగుతూ వచ్చాయి. కోవిడ్ రోగులకు ఆస్పత్రుల్లో తగినన్ని పడకలు లేకపోవడంతో సమస్య మరింత జటిలమైంది. ప్రభుత్వం ఆంక్షలను సడలించడం కూడా కేసులు పెరగడానికి దారి తీసింది. 33 ప్రైవేటు ఆస్పత్రుల్లో రోగుల కోసం 80 శాతం బెడ్స్ కేటాయించాలని ఢిల్లీ హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది.


Tags :
|
|

Advertisement