Advertisement

  • కరోనా సెకండ్ వేవ్ దాటికి కుదేలవుతున్న ఫ్రాన్స్ ...లాక్ డౌన్ దిశగా అడుగులు

కరోనా సెకండ్ వేవ్ దాటికి కుదేలవుతున్న ఫ్రాన్స్ ...లాక్ డౌన్ దిశగా అడుగులు

By: Sankar Thu, 29 Oct 2020 08:01 AM

కరోనా సెకండ్ వేవ్ దాటికి కుదేలవుతున్న ఫ్రాన్స్ ...లాక్ డౌన్ దిశగా అడుగులు


యూరప్ దేశాల్లో కరోనా ఉదృతి తిరిగి కొనసాగుతోంది. తొలిదశలో కరోనా కేసులు తగ్గినట్టు కనిపించడంతో లాక్ డౌన్ ఎత్తివేయడంతో పాటుగా అన్ని రంగాలకు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల తరువాత కరోనా యూరప్ దేశాల్లో విజృంభించడం మొదలుపెట్టింది. సెకండ్ వేవ్ ధాటికి అటు యూకే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కరోనాను కంట్రోల్ చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి సిద్ధం అవుతున్నది. ఇప్పటికే కొన్ని దేశాల్లో నైట్ కర్ఫ్యూ విధించారు.

ఇక ఇదిలా ఉంటె, ఫ్రాన్స్ లో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇప్పటికే ఆ దేశంలో 12 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా, 35 వేలకు పైగా మరణాలు సంభవించాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఆ దేశంలో 523 మరణాలు సంభవించాయి. ఏప్రిల్ తరువాత ఈ స్థాయిలో మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి. పైగా దేశంలోని 58శాతం వైద్యపడకలు అత్యవసర కోవిడ్ కేసులతో నిండిపోయింది.

ఆసుపత్రి, వైద్యులపై ఒత్తిడి పెరుగుతుండటంతో పాటుగా, కేసులు సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తిరిగి దేశంలో లాక్ డౌన్ విధించాలని చూస్తోంది. అయితే, వ్యాపార, రాజకీయ రంగాలనుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదురౌతున్నది. దేశంలో సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తే వ్యాపార రంగం దెబ్బతింటుంది. ఫలితంగా దేశం ఆర్ధికంగా చితికిపోతుందని, కరోనా కేసులు బయటపడిన ప్రాంతంలో లాక్ డౌన్ విధించాలని సూచిస్తున్నారు. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Tags :
|

Advertisement