Advertisement

  • వికీపీడియా పేజీలో జమ్మూ కాశ్మీర్‌ మ్యాప్‌పై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం

వికీపీడియా పేజీలో జమ్మూ కాశ్మీర్‌ మ్యాప్‌పై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం

By: chandrasekar Thu, 03 Dec 2020 11:50 PM

వికీపీడియా పేజీలో జమ్మూ కాశ్మీర్‌ మ్యాప్‌పై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం


వికీపీడియా పేజీలో జమ్మూ కాశ్మీర్‌ మ్యాప్‌పై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తపరచింది. మరోవైపు భారతదేశం-భూటాన్ భూభాగానికి సంబంధించిన వికీపీడియా పేజీలో ఈ మ్యాప్ లింక్ చేసినట్లు కనిపించింది. ఈ మ్యాప్‌లో అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని చైనాలో భాగంగా చూపిస్తుందని కథనాలు వచ్చాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ భూభాగాన్ని తప్పుగా మ్యాప్‌తో లింక్‌ చేశారని, దాన్ని సాధ్యమైనంత త్వరగా తొలగించాలని కేంద్ర ప్రభుత్వం వికీపీడియా కు సూచించినట్లు జాతీయ మీడియా నివేదికలు తెలియజేస్తున్నాయి. మరోవైపు భారతదేశం-భూటాన్ భూభాగానికి సంబంధించిన వికీపీడియా పేజీలో ఈ మ్యాప్ లింక్ చేసినట్లు చూపిస్తుంది. ఈ మ్యాప్‌లో అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని చైనాలో భాగంగా చూపిస్తుందని హిందుస్తాన్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. ఐటీ చట్టం 2000లోని సెక్షన్ 69ఏ ప్రకారం ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ నవంబర్ 27న వికీపీడియా కు సూచించిందని సమాచారం. భారతదేశం-భూటాన్ సరిహద్దులకు సంబంధించిన అంశాలపై వికీపీడియా పేజీలో జమ్మూ కాశ్మీర్‌ మ్యాప్‌ను తప్పుగా చూపించారు. దీనిపై వెంటనే చర్య తీసుకోవాలని తెలిపారు.

భారతదేశం-భూటాన్ భూభాగానికి సంబంధించిన మ్యాప్ విషయాన్ని ట్విట్టర్ యూజర్ హైలైట్ చేసినట్లు పీటీఐ తెలిపింది. అదే సమయంలో దీనిపై చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. భారతదేశ సమగ్రతను మరియు సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించినందున మ్యాప్‌కు లింక్‌ను తొలగించమని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ వికీపీడియాకు సూచించినట్లు సమాచారం. దీనిపై సత్వరమే స్పందిచి తప్పును సరిచేసుకోని పక్షంలో కేంద్ర ప్రభుత్వం వికీపీడియాపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నది. అవసరమైతే వికీపీడియాను దేశంలో బ్లాక్ చేసే వరకు వెళ్లొచ్చునని కథనాలు వస్తున్నాయి. భారతదేశ పటాన్ని తప్పుగా చూపించడం ఈ ఏడాది ఇది తొలిసారి కాదు. లేహ్ ప్రాంతాన్ని లఢాఖ్ కేంద్రపాలిత ప్రాంతానికి బదులుగా జమ్మూకాశ్మీర్ లోని ప్రాంతంగా ట్విట్టర్ మ్యాప్ చూపించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేయడంతో మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ క్షమాపణలు చెప్పడం తెలిసిందే. ఇకమీదట ఇలాంటివి చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.

Tags :
|

Advertisement