Advertisement

ఎమ్మెల్సీ కవిత హోం క్వారంటైన్‌లో

By: chandrasekar Wed, 14 Oct 2020 4:29 PM

ఎమ్మెల్సీ కవిత హోం క్వారంటైన్‌లో


ఎమ్మెల్సీ కవిత వచ్చే ఐదురోజులు హోం క్వారంటైన్‌లో ఉండనున్నారు. సోమవారం నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్‌ సందర్భంగా కవితను కలిసిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

దీంతో ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె ట్విట్టర్‌లో తెలియజేసారు. నాయకులు, కార్యకర్తలెవరూ తనను కలువడానికి రావొద్దని ఆమె విజ్ఞప్తిచేశారు. ఎమ్మెల్యే సంజయ్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Tags :
|

Advertisement