Advertisement

  • టెస్ట్ క్రికెట్ లో స్మిత్ బెస్ట్... కానీ ఓవరాల్ గా మాత్రం ఆ ఆటగాడికి తిరుగు లేదు ...వసీం జాఫర్

టెస్ట్ క్రికెట్ లో స్మిత్ బెస్ట్... కానీ ఓవరాల్ గా మాత్రం ఆ ఆటగాడికి తిరుగు లేదు ...వసీం జాఫర్

By: Sankar Sat, 06 June 2020 4:19 PM

టెస్ట్ క్రికెట్ లో స్మిత్ బెస్ట్... కానీ ఓవరాల్ గా మాత్రం ఆ ఆటగాడికి తిరుగు లేదు ...వసీం జాఫర్

ప్రస్తుత ప్రపంచ క్రికెట్ లో నడిచే చర్చల్లో ముఖ్యమైనది కోహ్లీ , స్మిత్ లలో ఎవరు గొప్ప బాట్స్మన్ అని ..కొందరు కోహ్లీ వోట్ వేస్తే మరికొందరు స్మిత్ ను సమర్ధించారు..లిమిటెడ్ ఓవర్ల ఫార్మటు లో కోహ్లీ కి పోటీ లేదు అన్నది ఎవరైనా ఒప్పుకునే మాట ..అయితే టెస్ట్ క్రికెట్ కు వచ్చేసరికి స్మిత్ కి కోహ్లీకి మధ్య ఎవరు బెస్ట్ అనే చర్చ నడుస్తూనే ఉంది..

రెండు సంవత్సరాల కిందటి వరకు టెస్ట్ క్రికెట్ లో టన్నుల కొద్దీ పరుగులు సాధిస్తూ ఐసీసీ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ రాంక్ సాధించి బ్రాడ్మన్ తర్వాత అంతటి గొప్ప టెస్ట్ ఆటగాడిగా ముద్ర వేసుకున్నాడు స్టీవ్ స్మిత్ అయితే ఒక్కసారిగా బాల్ టాంపరింగ్ వివాదం లో కూరుకుపోవడం, వన్ ఇయర్ పాటు నిషేధం ఎదుర్కోవడం ఆ లోపు విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ లో కూడా అత్యున్నత స్థాయిని అందుకొని ఐసీసీ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ రాంక్ ని చేరుకోవడం తో ఇక టెస్టుల్లో కూడా కోహ్లీ నే బెస్ట్ అని అందరూ భావించారు ..అయితే నిషేధం తర్వాత మళ్లీ టీంలోకి వచ్చి పరుగుల వరద పారిస్తూ ఐసీసీ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని స్మిత్ కోహ్లీ నుంచి లాగేసుకున్నాడు ..దీనితో మళ్లీ బెస్ట్ ఎవరు అనే చర్చ మొదటికి వచ్చింది ..

అయితే బారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ మాట్లాడుతూ టెస్ట్ క్రికెట్ లో కోహ్లీ , స్మిత్ లలో స్మిత్ ఏ బెస్ట్ అని తేల్చేసాడు.. అయితే మూడు ఫార్మట్లలో కలిపి బెస్ట్‌ బ్యాట్స్‌మన్‌గా విరాట్‌ కోహ్లి నిలుస్తాడని తెలిపాడు. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కోహ్లి తర్వాత రోహిత్‌ శర్మ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ అని జాఫర్‌ అభిప్రాయపడ్డాడు.

Tags :
|
|
|
|

Advertisement