Advertisement

  • కోల్‌కతాలో లాబ్రడార్ జాతికి చెందిన శునకం ‘సియా' రక్తదానం దానం చేసింది

కోల్‌కతాలో లాబ్రడార్ జాతికి చెందిన శునకం ‘సియా' రక్తదానం దానం చేసింది

By: chandrasekar Wed, 08 July 2020 5:56 PM

కోల్‌కతాలో లాబ్రడార్ జాతికి చెందిన శునకం ‘సియా' రక్తదానం దానం చేసింది


చెన్నైకి చెందిన ఓ జంట తమ పెంపుడు కుక్కను కాపాడటం కోసం దాన్ని వెంటబెట్టుకొని కోల్‌కతా వరకు వెళ్లారు. కోల్‌కతాలో లాబ్రడార్ జాతికి చెందిన శునకం ‘సియా’ దానికి రక్తదానం చేసి కాపాడింది. రక్తదానం చేసి ఓ శునకం హీరోగా నిలిచింది. డానీ అనే 13 ఏళ్ల పెంపుడు కుక్క కిడ్నీ సమస్యతో బాధపడుతోంది. కొంత కాలంగా డానీకి చికిత్స కోసం దాని యజమానులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.

బెంగాలీ యాక్టర్ అనింద్య ఛటర్జీ ఆ శునకం ప్రాణాలు కాపాడటానికి ముందుకొచ్చారు. తన పెంపుడు కుక్క సియాను రక్తదానానికి సిద్ధం చేశారు. కోల్‌కతాకు చెందిన వెటర్నరీ డాక్టర్ దెబాజిత్ రాయ్.. ఆ శునకానికి రక్తమార్పిడి చేసి ప్రాణాలు నిలిపారు. ‘రక్తదానం చేసే సమయంలో సియా ఎలాంటి ఆందోళన లేకుండా చాలా కూల్‌గా ఉంది.

ఎలాంటి ఇబ్బంది పడకుండా పనిని పూర్తి చేసింది. ఇందుకు కేవలం 15 నిమిషాల సమయం మాత్రమే తీసుకుంది. సియా చేసిన సాయం వల్ల నాకు ఈరోజు గర్వంగా ఉంది. డానీని కాపాడుకునేందుకు ఓ జంటకు ఆమె (సియా) సాయం చేసింది’ అని అనింద్య పేర్కొన్నారు.

డానీ దీర్ఘకాలిక మూత్రపిండ సమస్యతో బాధపడుతోందని డాక్టర్ దేబాజిత్ రాయ్ తెలిపారు. ‘డానీకి చికిత్స అందించడానికి సరిపోయే రక్తం కావాల్సి వచ్చింది. అయితే సరైన అవగాహన లేకపోవడం వల్ల సాయం చేయడానికి ఎవరూ దొరకని పరిస్థితి.

కోల్‌కతాలో ఇలాంటి చికిత్స కూడా కొత్తది. కానీ, డానీకి చివరికి రక్తదాత లభించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది’ ఆయన అన్నారు. గత నెలలో యూఎస్‌లో అనారోగ్యంతో ఉన్న ఓ కుక్కపిల్లను కాపాడేందుకు ఏడేళ్ల జాక్స్‌ అనే శునకం రక్తదానం చేసి వార్తల్లోకెక్కింది. జాక్స్ మెడ భాగం నుంచి రక్తం తీస్తుండగా.. యజమాని దాని తలను కదలకుండా పట్టుకొని దానికి ముద్దుపెడుతూ నిల్చున్నారు. దీంతో జాక్ తోక ఆడిస్తూ కదలకుండా నిల్చుంది. కనీసం ఒక్కసారి కూడా అరవలేదని యజమాని తెలిపారు.

Tags :

Advertisement