Advertisement

  • పన్ను చెల్లింపు లో జాప్యం జరిగితే, ఆలస్య‌ రుసుం చెల్లించాల్సిన‌ అవసరం లేదు

పన్ను చెల్లింపు లో జాప్యం జరిగితే, ఆలస్య‌ రుసుం చెల్లించాల్సిన‌ అవసరం లేదు

By: chandrasekar Thu, 11 June 2020 02:24 AM

పన్ను చెల్లింపు లో జాప్యం జరిగితే, ఆలస్య‌ రుసుం చెల్లించాల్సిన‌ అవసరం లేదు


ప‌న్ను చెల్లింపుదారుల‌కు ఒడిశా ప్ర‌భుత్వం శుభ‌వార్త తెలిపింది. పన్ను చెల్లింపు రిటర్నుల దాఖలులో జాప్యం జరిగితే, ఆలస్య‌ రుసుం చెల్లించాల్సిన‌ అవసరం లేకుండా ఈ నెల 30 వరకు రిటర్నులు దాఖలు చేయవచ్చునని ఒడిశా స‌ర్కారు ప్రకటించింది.

రూ.5 కోట్ల వరకు టర్నోవర్ గ‌ల పన్ను చెల్లింపుదారులు వడ్డీ లేకుండా ఈ నెల 30 వరకు రిటర్నులు దాఖలు చేయవచ్చ‌ని తెలిపింది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్నందువల్ల పన్ను చెల్లింపుదారులు ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో రిటర్నులు దాఖలు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

రూ.5 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్‌గల పన్ను చెల్లింపుదారులు పన్ను రిటర్నులను ఆలస్యంగా దాఖలు చేస్తే మొదటి 15 రోజుల ఆలస్యానికి రుసుం చెల్లించాల్సిన అక్క‌ర్లేద‌ని, తదుపరి ఆలస్యానికి 9 శాతం వడ్డీ వర్తిస్తుందని తెలిపింది. దీనికి సంబంధించిన ప్రకటనను ఒడిశా రాష్ట్ర వాణిజ్య పన్నులు, జీఎస్‌టీ కమిషనరేట్ విడుదల చేసింది.

Tags :
|

Advertisement