Advertisement

  • ఇక ఆంధ్ర ప్రదేశ్ లో రెండేళ్లకే పదోన్నతి జీవో జారీ

ఇక ఆంధ్ర ప్రదేశ్ లో రెండేళ్లకే పదోన్నతి జీవో జారీ

By: chandrasekar Fri, 09 Oct 2020 2:39 PM

ఇక ఆంధ్ర ప్రదేశ్ లో రెండేళ్లకే పదోన్నతి జీవో జారీ


ఇక ఆంధ్ర ప్రదేశ్ లో రెండేళ్లకే పదోన్నతి అర్హతను ప్రతిపాదించిన ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతి సర్వీసు కాలాన్ని తగ్గించి జీవో జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో పదోన్నతి పొందాలంటే సదరు ఉద్యోగి కనీసం 3 ఏళ్లు ప్రస్తుత హోదాలో పనిచేసి ఉండాలనే నిబంధన ఉండేది.

ఇందుకోసం మూడేళ్ల సర్వీసు పూర్తయిన ఉద్యోగులకే పదోన్నతు లకు అవ కాశం ఉండేది. ప్రస్తుతం ఆ సర్వీసు కాలాన్ని రెండేళ్లకు తగ్గించే ప్రతి పాదనను చేసింది. జీ.వో.నెం.627 ప్రకారం 1983 డిసెంబరు 21నుంచి 2014 మే 30వరకు ఐదేళ్ల కనీస సర్వీసు, జీ.వో.నెం.230 ప్రకారం 2014 మే 31నుంచి ఇప్పటి వరకు మూడేళ్ల కనీస సర్వీసు ఉంటేనే పదోన్నతి ఇస్తున్నారు.

ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌ కుమార్‌ సోమవారం ఉత్తర్వులు ప్రకారం జీ.వో.ఎం.ఎస్.నెం.175 ను జారీచేశారు. ఇందుకోసం ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనికి వచ్చే ఉద్యోగుల్లో ఎంత మంది రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నారు, అందులో ఎంత మంది పదోన్న తులకు అర్హులవుతారో వివరాలు పంపాలని అన్ని ప్రభుత్వ శాఖలను ఆర్థిక శాఖ కోరింది. ఈ వివరాలను పంపాలని ఇటీవల శాఖల హెచ్‌వోడీలకు లేఖ రాసింది.

Tags :

Advertisement