Advertisement

  • వారికి డ్రింక్స్ అందించడం నాబాధ్యత ...చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్

వారికి డ్రింక్స్ అందించడం నాబాధ్యత ...చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్

By: Sankar Thu, 15 Oct 2020 4:04 PM

వారికి డ్రింక్స్ అందించడం నాబాధ్యత ...చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్


ఐపీఎల్ లో గత ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ చేరుకోవడంలో ముఖ్య పాత్ర పోషించాడు ఆ జట్టు స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్. గత సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున మొత్తం 17 మ్యాచ్‌లు ఆడిన తాహిర్ 26 వికెట్లు సాధించి పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు.

గత ఏడాది ఎంఎస్ ధోని జట్టులో ముఖ్య ఆటగాడిగా ఉన్న ఈ దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఈ సీజన్‌లో చెన్నై కోసం ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే ఇప్పటివరకు చెన్నై ఆడిన 8 మ్యాచ్ లలో బెంచ్ కే పరిమితమైన తాహిర్ మ్యాచ్ మధ్యలో ఆటగాళ్లకు డ్రింక్స్ అందిస్తున్నాడు. ఈ విషయం తన అభిమానులతో పాటుగా మరికొంతమందికి నచ్చడం లేదు. దాంతో ఈ విషయం గురించి అతడిని సోషల్ మీడియాలో ప్రశ్నించగా వారికి రిప్లై ఇచ్చాడు తాహిర్.

తన ట్విట్టర్ లో... "నేను ఆడుతున్నప్పుడు, చాలా మంది ఆటగాళ్ళు నా కోసం డ్రింక్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు నా కంటే అర్హత ఉన్న ఆటగాళ్ళు మైదానంలో ఉన్నప్పుడు వారికి నేను డ్రింక్స్ ఇవ్వడం నా కర్తవ్యం" అని ఇమ్రాన్ తాహిర్ పేర్కొన్నాడు.

Tags :
|

Advertisement