Advertisement

  • తాత్కాలిక బాస్ గా బాధ్యతలు చేపట్టిన ఇమ్రాన్ ఖవాజ

తాత్కాలిక బాస్ గా బాధ్యతలు చేపట్టిన ఇమ్రాన్ ఖవాజ

By: chandrasekar Wed, 08 July 2020 10:42 AM

తాత్కాలిక  బాస్ గా బాధ్యతలు చేపట్టిన ఇమ్రాన్  ఖవాజ


బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ శశాంక్ మనోహర్ ఐసీసీ చీఫ్ పదవి నుంచి తప్పుకున్నారు. రెండుసార్లు రెండేళ్ల టర్మ్ ను పూర్తి చేసుకున్న శశాంక్. తనకు ఇంకోసారి అవకాశమున్నా వైదొలగ్గా ప్రస్తుత డిప్యూటి చైర్మన్ ఇమ్రాన్ ఖవాజ తాత్కాలిక బాస్ గా బాధ్యతలు కూడా చేపట్టారు. అంతేకాక సోమవారం లోపు చైర్మన్ పదవికి నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తి చేస్తామని ఇమ్రాన్ వెల్లడించారు. కానీ, దీనిపై ఐసీసీ నుంచి తదుపరి ప్రకటన రాకపోవడంతో గడువు పొడిగించే అవకాశం ఉంది. అయితే శశాంక్ స్థానాన్ని భర్తీ చేసేదెవరు? బాస్ గా వరల్డ్ క్రికెట్ ను నడిపించేదెవరూ ? అంటే పలువురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారెవరో ఏంటో చూద్దాం.

ఐసీసీ ప్రెసిడెంట్ రేసులో ఇంగ్లండ్ కు చెందిన కొలిన్ గ్రేవ్స్ పేరు చాలా ప్రముఖంగా వినిపిస్తోంది. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) మాజీ చైర్మన్ అయిన గ్రేవ్స్ కు క్రికెట్ పరిపాలన వ్యవహారాల్లో చాలా అనుభవం ఉంది. పైగా అడ్మినిస్ట్రేటర్ గా మంచి మార్కులు సంపాదించారు. వీటిన్నింటికీ మించి ఈసీబీతోపాటు క్రికెట్ స్ట్రేలియా(సీఏ), బీసీసీఐ సపోర్ట్ తనకు ఉంది. క్రికెట్ పెద్దన్నలైన ఆసీస్ , ఇండియా, ఇంగ్లండ్ మద్దతు ఉన్నప్పటికీ సౌతాఫ్రికా వంటి ఇతర బోర్డుల నుంచి అండ లేకపోవడం అతనికి మైనస్ . కానీ బీసీసీఐ బహిరంగంగా తన మద్దతు ప్రకటిస్తే గ్రేవ్స్ కు తిరుగు ఉండదు.

శశాంక్ మనోహార్ తన పదవికి రాజీనామా చేయడంతో డిప్యూటీ చైర్మన్ గా ఉన్న ఇమ్రాన్ ఖవాజ తాత్కాలిక చైర్మన్ గా భాద్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజా పరిణామాలతో ఇమ్రాన్ కూడా చైర్మన్ రేసులో నిలిచారు. సింగపూర్ క్రికెట్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ అయిన ఇమ్రాన్ వృత్తిపరంగా లాయర్ . కొన్ని బోర్డుల నుంచి అతనికి మద్దతు కూడా దొరికే అవకాశముంది. కానీ బిగ్ త్రీ (ఇండియా, ఇంగ్లండ్ , ఆస్టేలియా)ని కాదని ఓ అసోసియేట్ నేషన్ సభ్యుడు ఐసీసీ బాస్ అవ్వడం అంత ఈజీ కాదు. ఒక వేళ అయినా బిగ్ త్రీ ఒత్తిడి దాటి నెట్టుకురాలేరు. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు మాజీ ప్రెసిడెంట్. ఐసీసీ చైర్మన్ పదవి కోసం ప్రయత్నిస్తానని ఇప్పటిదాకా అధికారికంగా చెప్పింది కామెరూనే. డేవ్ కు యునైటెడ్ స్టేట్స్ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ నుంచి మద్దతు ఉంది. కానీ డేవ్ నిజంగా బరిలోకి దిగాలంటే రెండు శాశ్వత సభ్య దేశాలు ఆయన్ని నామినేట్ చేయాలి. డేవ్ ముందున్న పెద్ద చాలెంజ్ ఇదే. డేవ్ తోపాటు న్యూజిలాండ్ కు చెందిన గ్రెగర్ బార్ల్కీ, క్రికెట్ సౌతాఫ్రికాకు చెందిన క్రిస్ నెంజానీ కూడా ఆశావాహుల జాబితాలో ఉన్నారు.

బీసీసీఐ చాలా సింపుల్ గా దాదాకు ఓట్లు తీసుకొస్తుంది. నిజానికి ఐసీసీ బాస్ పదవికి సౌరవ్ అన్ని విధాలా అర్హుడు’ టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ గురించి ఐసీసీ బోర్డు మెంబర్ ఒకరు చేసిన వ్యాఖ్యలివి. ఐసీసీ చైర్మన్ రేసులో దాదా స్థానం ఏంటో చెప్పేందుకు ఇవి సరిపోతాయి. నిజానికి, ఐసీసీ ఎన్నికల అంశంలో బీసీసీఐతోపాటు గంగూలీ నుంచి ఇప్పటిదాకా ఎలాంటి సంకేతాలు రాలేదు. కానీ చైర్మన్ రేసులో సౌరవ్‌కు మాత్రం రోజురోజుకి మద్దతు పెరిగిపోతోంది.

ఐసీసీ చైర్మన్ గా గంగూలీ మాకు ఓకే అంటూ పలు బోర్డులు కూడా ప్రకటనలు చేశాయి. ఇప్పుడున్న పరిస్థితిని చూస్తుంటే దాదా సై అంటే ఐసీసీ సింహాసనాన్ని ఎక్కడం ఖాయం. కానీ దాదా మనుసులో ఏముందో ఎవ్వరికీ తెలియదు. వాస్తవంలోకి వస్తే ఇండియా మాజీ కెప్టెన్ గంగూలీ ప్రస్తుతం బీసీసీఐ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. ఆ పదవీకాలం త్వరలోనే ముగియనుంది. ఆ పదవీకాలం పొడిగింపు అంశం ప్రస్తుతం సుప్రీం కోర్డులో ఉంది. సుప్రీం నుంచి సానుకూల తీర్పు వస్తే దాదా బీసీసీఐ బాస్ గా కొనసాగుతాడనే దానిలో ఎలాంటి సందేహం లేదు. కానీ సుప్రీం లోధా కమిటీ సూచనలను అమలు చేయాలని చెబితే మాత్రం గంగూలీ ఐసీసీ పీఠంపై కన్నేసి అవకాశం ఉంది. టీ20 వరల్డ్ కప్ రద్దు లేదా వాయిదా పడితే సెప్టెంబర్– అక్టోబర్ విండోలో ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ ప్రస్తుతం ప్లాన్స్ చేస్తోంది. ఇలాంటి సమయంలో ఇండియాకు చెందిన శశాంక్ మనోహార్ ఐసీసీ పదవిని వదిలేయడం బీసీసీఐకి ఎదురుదెబ్బ కావాలి. కానీ శశాంక్ లేకపోవడమే ఇండియన్ బోర్డుకు ప్లస్ అని పలువురు అంటున్నారు. శశాంక్ బాధ్యతలు స్వీకరించినప్పటీ నుంచి బీసీసీఐ, ఐసీసీ మధ్య వివాదాలు పెరగడమే ఇందుకు కారణం.

570 మిలియన్ డాలర్లుగా ఉండే బీసీసీఐ షేర్ ను శశాంక్ వచ్చాక కొంచెం కొంచెంగా తగ్గిస్తూ ఐసీసీ దానిని 365 మిలియన్ డాలర్లు చేసింది. దీనికి తోడు ప్రకటనల రెవెన్యూలో పెద్ద వాటాదారైన బీసీసీఐకి ఐసీసీకి చెందిన ఫైనాన్షియల్ అండ్ కమర్షియల్ అఫైర్స్ కమిటీలో ప్రాతినిధ్యం లేకపోవడం చాలా కాలంగా సమస్యగా మారింది. ఆయా సమస్యలను పరిష్కరించడంలో శశాంక్ పూర్తిగా ఫెయిలయ్యారు. దీంతో కొత్త చైర్మన్ ద్వారా ఆ సమస్యలను బీసీసీఐ ఈజీగా పరిష్కరించుకోగలదని చెబుతున్నారు. ఆ కొత్త బాస్ గంగూలీనే అయితే ఇండియన్ బోర్డుకు అడ్డే ఉండదని అంటున్నారు.

Tags :
|

Advertisement