Advertisement

  • పాకిస్తాన్ ను గ్రే లిస్ట్ నుంచి తొలగించడంలో విఫలం అయిన ఇమ్రాన్ ఖాన్

పాకిస్తాన్ ను గ్రే లిస్ట్ నుంచి తొలగించడంలో విఫలం అయిన ఇమ్రాన్ ఖాన్

By: Sankar Sun, 25 Oct 2020 4:21 PM

పాకిస్తాన్ ను గ్రే లిస్ట్ నుంచి తొలగించడంలో విఫలం అయిన  ఇమ్రాన్ ఖాన్


ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) జాబితాలో పాకిస్తాన్ గ్రే లిస్ట్‌‌లో ఉన్న సంగతి తెలిసెందే. ఈ సంవత్సర ఎఫ్ఏటీఎఫ్ సమావేశాన్ని ఇటీవల నిర్వహించారు. అందులో పాల్గొన్న ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్‌ను గ్రే లిస్ట్ నుంచి తప్పించడంలో విఫలమయ్యాడు.

దాంతో పాకిస్తాన్‌లోని ప్రతిపక్షం వారు ఇమ్రాన్‌ను ఎద్దేవా చేస్తున్నారు. అధికార పక్ష వైఫల్యానికి తగిన బుద్ది చెప్పాలని ప్రతిపక్ష పార్టీ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) నాయకుడు సెనెటా షెర్రీ రెహ్మాన్ అన్నారు. ‘ప్రభుత్వం సరిగా పని చేయలేదు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకుండా దేశ పరువు తీశారు. పాకిస్తాన్‌లోని మంచిని ఎవ్వరూ పట్టించుకోరు. దానికి తోడు ఈ చేతకాని ప్రభుత్వం కారణంగా దేశానికున్న పేరు నాశనం అవుతుంద’ని అన్నారు.

వారి ప్రసంగంలో ప్రభుత్వాన్ని తక్కువ చేసి చూపే కోణాలే ఎక్కవ కనిపిస్తాయి. అయితే పాకిస్తాన్ మొదటగా 2018లో గ్రే లిస్ట్‌లోకి వెళ్లింది. అయితే తరువాత 27 పాయింట్లకు గడువు పెట్టారు. 2019 చివరి వరకు ఈ గడువు ముగిసింది, కానీ కరోనా కారణంగా మరింత గడువు పెరిగినప్పటికీ పాకిస్తాన్ ఏమీ చేయలేక పోయింది. మళ్లీ గ్రే లిస్ట్‌లోనే కోనసాగనుందని ఎఫ్ఏటీఎఫ్ సమావేశంలో తేలింది.

Tags :
|

Advertisement