Advertisement

  • థాయిలాండ్ లో రాచరికం రద్దు చేయాలనీ విద్యార్థుల భారీ ఉద్యమం

థాయిలాండ్ లో రాచరికం రద్దు చేయాలనీ విద్యార్థుల భారీ ఉద్యమం

By: Sankar Fri, 16 Oct 2020 9:04 PM

థాయిలాండ్ లో రాచరికం రద్దు చేయాలనీ విద్యార్థుల భారీ ఉద్యమం


థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. దేశంలో రాజరికాన్ని రద్దుచేయాలని విద్యార్థులు భారీ ఎత్తున జాతీయ ఉద్యమం చేపట్టడంతో వారిని అణచివేసేందుకు ప్రధాని ప్రయుత్‌చాన్‌ ఓచా ప్రభుత్వం గురువారం ఉదయం అత్యవసర పరిస్థితి ప్రకటించింది.

దేశంలో కరోనా కారణంగా ఇప్పటికే జాతీయ అత్యవసర పరిస్థితి కొనసాగుతున్నది. అనేక నేరాలకు పాల్పడిన మాజీ సైనిక జనరళ్లను శిక్షించాలని, రాజరికాన్ని రద్దుచేయాలని 1973నాటి విద్యార్థి తిరుగుబాటు స్ఫూర్తితో విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. ఇటీవలే బ్యాంకాక్‌ను ముట్టడించటంతో వారికి వ్యతిరేకంగా రాజరికానికి మద్దతిచ్చే కొంతమంది ఆందోళనకు దిగారు. రాజకుటుంబీకుల కాన్వాయ్‌లకు అడ్డుతగిలి కొందరు ఆందోళనకారులు నిరసన తెలుపటంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దాంతో విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న దాదాపు 25మందిని ప్రభుత్వం నిర్బంధించింది.

థాయ్‌లాండ్‌లో రాజు, రాణి తదితర రాజకుటుంబీకులకు ప్రజలు అసాధారణ గౌరవ మర్యాదలు ఇవ్వాల్సి ఉంటుంది. వారు వెళ్తున్నప్పుడు సామాన్యులు నేలపై కూర్చోవాలి. విద్యార్థుల ఆందోళన కారణంగా రాజకుటుంబానికి అవమానం జరిగిందని, వారి గౌరవం కాపాడేందుకు కఠినంగా వ్యవహరించక తప్పదని ప్రభుత్వం స్పష్టంచేసింది.

Tags :

Advertisement