Advertisement

పెళ్లి భోజనంలో టేస్ట్ తో పాటు ఇమ్యూనిటీ

By: chandrasekar Mon, 14 Dec 2020 8:32 PM

పెళ్లి భోజనంలో టేస్ట్ తో పాటు ఇమ్యూనిటీ


పెళ్లి భోజనంలో రుచి చాలా ముఖ్యమైనది. పెళ్ళికి వచ్చిన వారందరు రుచులకు ఇంపార్టెన్స్ ఇస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో రుచితోపాటు ఇమ్యూనిటీ ఉండే ఎనర్జీ ఫుడ్ ఏర్పడు చేస్తున్నారు. సోషల్ డిస్టెన్స్, మాస్క్, శానిటైజర్‌‌‌‌తో పాటు మెనులో ఇమ్యూనిటీ పెంచే రెసిపీలను యాడ్ చేస్తున్నారు. ప్రస్తుతం వెడ్డింగ్ మెనూ టేస్టీ విత్ హెల్దీగా మారిపోయింది. చల్లటి పదార్థాల కంటే వేడిగా ఉండే ఆహారపదార్థాలు‌‌ ఎక్కువగా ఉండేలా చూసుకుంటున్నారు.

సూప్‌‌ల్లో కూడా అల్లం, మిరియాలు ఎక్కువగా వాడుతున్నారు. మెయిన్ మెనులో ఇమ్యూనిటీ పెంచేందుకు కూరల్లో పసుపు ఎక్కువగా వాడుతున్నారు. ఇవన్నీ క్యాటరింగ్ వాళ్లు వేడివేడిగా వండి వడ్డిస్తున్నారు. పసుపు స్పెషల్ కిచిడీలు, బీట్ రూట్, మిరియాలు, అల్లం, కొబ్బరితో చేసిన డిసర్ట్స్, సలాడ్స్, పులావ్‌‌లు అందిస్తున్నారు. వెజ్, నాన్ వెజ్ వేరువేరుగా ప్యాక్‌‌ చేసి బాక్స్‌‌లపై రాసి గెస్ట్‌‌ల టేబుల్ దగ్గరకే పంపిస్తున్నాం. మండపం డెకరేషన్‌‌కి వచ్చే లేబర్స్‌‌కి షూస్, మాస్క్‌‌లు, గ్లౌజ్‌‌లు వంటివి ప్రొవైడ్ చేసి వాళ్లకు సెపరేట్ ప్లేస్ ఇస్తున్నారు. ఫొటోగ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్‌‌కి మాస్క్‌‌లు, గ్లౌజ్‌‌లు ఇస్తున్నారు. ప్రతి గెస్ట్ అరగంటకు ఒకసారి హ్యాండ్ శానిటైజేషన్ చేసుకోవాలి, డిస్టెన్స్ పాటించాలి అని అనౌన్స్‌‌ చేస్తున్నారు. మండపం మీద కుటుంబ సభ్యులు మినహా అతిథులు ఎవరు ఉండకుండా చూస్తున్నారు.

Tags :
|
|

Advertisement