Advertisement

  • అమెరికాలోని ఉటా యూనివర్సిటీ స్కాలర్‌షిప్‌కు ఎంపకైన ఐఐటీ విద్యార్థి...

అమెరికాలోని ఉటా యూనివర్సిటీ స్కాలర్‌షిప్‌కు ఎంపకైన ఐఐటీ విద్యార్థి...

By: chandrasekar Mon, 07 Dec 2020 4:41 PM

అమెరికాలోని ఉటా యూనివర్సిటీ స్కాలర్‌షిప్‌కు ఎంపకైన ఐఐటీ విద్యార్థి...


ప్రతిభకు పేదరికం అడ్డుకాదని ఎన్నోసార్లు నిరూపించారు విజేతలు. అలాంటి విజయాన్నే సాధించాడు బీహార్‌ కు చెందిన రాహుల్ కుమార్ (22) అనే ఐఐటీ విద్యార్థి. బీహార్ నలందా జిల్లాలోని సోసాండి అనే మారుమూల గ్రామానికి చెందిన రాహుల్ కుమార్... దేశంలోని అత్యున్నత విద్యాసంస్థలలో ఒకటైన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), రూర్కీ నుంచి మెటలర్జికల్, మెటీరియల్స్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశాడు. నిరుపేద కుంటుంబానికి చెందిన ఆయన తండ్రి సునీల్ సింగ్ (52) రోజువారి కూలీగా సూరత్‌ లో విద్యుత్ మగ్గంపై పనిచేస్తారు. మొదట బీహార్‌లో ఉన్న ఆయన కుటుంబం జీవనోపాధి కోసం గుజరాత్‌కు వలస వెళ్లింది. ఐఐటీ రూర్కీలో చదివిన రాహుల్ తన అకడమిక్‌లో ఉన్నతంగా రాణిస్తూ, ఎల్లప్పుడూ సమాజ శ్రేయస్సు వైపు మొగ్గుచూపేవాడు. సమాజ సేవపై అతనికి ఉన్న ఉత్సాహంతో ఐఐటి రూర్కీ నేషనల్ సర్వీస్ స్కీమ్ (NSS) ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యాడు. అంతేకాక, ఐఐటీ రూర్కీలో డిజిటల్ మోడ్ ద్వారా ఇటీవల నిర్వహించిన వార్షిక సమావేశంలో భాగంగా తన సామాజిక కార్యక్రమాలను గుర్తించిన కాలేజీ యాజమాన్యం మాజీ రాష్ట్రపతి డాక్టర్ శంకర్ దయాల్ శర్మ పేరుతో ఇచ్చే బంగారు పతకంతో సత్కరించింది. కాగా, ఈ ఏడాదే ఇంజినీరింగ్ పూర్తి చేసుకున్న కుమార్ అమెరికాలోని ఉటా విశ్వవిద్యాలయంలో PHD అడ్మిషన్‌తో పాటు, అదే యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా బోధించేందుకు స్కాలర్‌షిప్ అర్హత కూడా సాధించాడు.

స్కాలర్‌షిప్‌కి ఎంపిక:

రాహుల్ కుమార్ సాధించిన ఘనతపై ఐఐటి రూర్కీ డైరెక్టర్ ప్రొఫెసర్ అజిత్ కె చతుర్వేది మాట్లాడుతూ... “రాహుల్ తన ఉత్తమ లీడర్‌షిప్, మేనేజ్ స్కిల్స్‌తో సుమారు 1,000 మంది విద్యార్థుల బృందానికి, ప్రభుత్వ అధికారులకి, NGOలకు నాయకత్వం వహించాడు. అంతేకాక, అతను వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించాడు. యూత్ లీడర్‌షిప్‌లో రాహుల్ చేసిన కృషికి గాను అనేక అవార్డులు లభించాయి. కాగా, ఈ ఏడాది జరిగిన కాన్వకేషన్ చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ కాన్పొకేషన్‌కు మా పూర్వ విద్యార్థి అశోక్ సూటాతో పాటు, మా గవర్నర్స్ బోర్డు ఛైర్మన్ బివిఆర్ మోహన్ రెడ్డి అధ్యక్షత వహించారు." అని పేర్కొన్నారు.

Tags :

Advertisement