Advertisement

  • నీట్, జేఈఈ లకు ఆన్‌లైన్ ప్రాక్టీస్ టెస్టులను సిద్ధం చేసిన ఐఐటీ- జేఈఈ ఫోరం

నీట్, జేఈఈ లకు ఆన్‌లైన్ ప్రాక్టీస్ టెస్టులను సిద్ధం చేసిన ఐఐటీ- జేఈఈ ఫోరం

By: chandrasekar Sat, 12 Dec 2020 11:24 AM

నీట్, జేఈఈ లకు ఆన్‌లైన్ ప్రాక్టీస్ టెస్టులను సిద్ధం చేసిన ఐఐటీ- జేఈఈ ఫోరం


దేశవ్యాప్తంగా జరిగే మెడికల్ ఎంట్రన్స్ నీట్ టెస్టుకు మరియు ఇంజనీరింగ్లో ప్రఖ్యాతి గాంచిన జేఈఈ ల ప్రవేశ పరీక్షలకు ఇప్పుడు ప్రాక్టీస్ టెస్ట్ లను ఆన్ లైన్ ద్వారా అందించనున్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఎంట్రన్స్ లో విజయం పొందవచ్చును. కరోనా కారణంగా విద్యార్థులు లైవ్ క్లాసులు అటెండ్ కాలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్నీ దృష్టిలో ఉంచుకొని వీరికి ఉపయోగ పడేవిధంగా ఈ అవకాశం కల్పించినట్లు తెలిసింది.

వచ్చే సంవత్సరం జరగనున్న జాతీయ ప్రవేశ పరీక్ష 2021 లకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఐఐటీ- జేఈఈ ఫోరం ఇప్పుడు శుభవార్త చెప్పింది. విద్యార్థులు తమ ప్రతిభా సామర్థ్యాలను పరీక్షించుకొనేందుకు నీట్ మరియు జేఈఈ (మెయిన్, అడ్వాన్స్డ్) ఆన్‌లైన్ ప్రాక్టీస్ టెస్టులను సిద్ధం చేసినట్లు ఇందుకోసం విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఐఐటీ- జేఈఈ ఫోరం కన్వీనర్ లలిత్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో ఇంటి వద్దే డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్, టాబ్లెట్, మొబైల్ ఫోన్ ద్వారా పరీక్షలు రాసుకునే విధంగా వీలవుతుందని తెలిపారు.

ఇందుకోసం ఆన్ లైన్ లో అపరిమితమైన మాక్, ప్రాక్టీస్ పరీక్షలు, గ్రాండ్ టెస్టులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసినట్లు లలిత్ కుమార్ చెప్పారు. విద్యార్థులు వెబ్‌సైట్ ద్వారా లాగిన్ అయ్యి 2021 పరీక్షలు ప్రారంభం అయ్యే వరకు ఈ ప్రాక్టీస్ టెస్టులు రాసుకోవచ్చని విద్యార్థులకు సూచించారు. టెస్ట్ సిరీస్ రాసిన అనంతరం దీని ద్వారా ఆలిండియా ర్యాంక్ కూడా తెలుసుకోవచ్చన్నారు. ఇందుకోసం విద్యార్థులు www.iitjeeforum.com వెబ్‌సైట్ ద్వారా లాగిన్ అయ్యి పరీక్షలు రాసుకోవచ్చని తెలిపారు. మరింత సమాచారం, సందేహాల నివృత్తి కోసం 9849016661 మొబైల్ నంబర్‌ను సంప్రదించి తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని ఆయన సూచించారు.

Tags :
|
|

Advertisement