Advertisement

  • మాస్క్ ధరించకుండా తిరిగితే రూ.1000 ఫైన్ కట్టాల్సిందే

మాస్క్ ధరించకుండా తిరిగితే రూ.1000 ఫైన్ కట్టాల్సిందే

By: chandrasekar Mon, 10 Aug 2020 7:23 PM

మాస్క్ ధరించకుండా తిరిగితే రూ.1000 ఫైన్ కట్టాల్సిందే


దేశంలో చాలా వేగంగా పెరుగుతున్న కరోనాని అరికట్టడానికి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదు. గుజ‌రాత్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొన‌సాగుతున్న‌ది. అయినా కొవిడ్ నిబంధ‌న‌లు పాటించ‌డంలో ప‌లువురు గుజ‌రాతీలు అశ్ర‌ద్ధ చేస్తున్నారు. త‌ప్ప‌నిస‌రిగా మాస్కు ధరించాల‌ని, సామాజిక దూరం పాటించాల‌ని అధికారులు చెబుతున్నా చాలా మంది ప‌ట్టించుకోవ‌డంలేదు. దీంతో ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టివ‌ర‌కు మాస్కు ధ‌రించ‌క‌పోతే రూ.200గా ఫైన్‌ను ఇక నుంచి ఏకంగా రూ.1000కి పెంచింది. పెంచిన ఫైన్ ఆగ‌స్టు 11 నుంచి అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి విజ‌య్ రూపానీ వెల్ల‌డించారు. కనీసం ఈ విధంగానైనా వ్యాప్తిని అరికట్టవచ్చేమోనని తెలిపారు.

అనతి కాలంలో విపరీతంగా కరోనా పెరగడం వల్ల గుజ‌రాత్‌లో ప్ర‌తిరోజు వెయ్యికిపైగా క‌రోనా కేసులు న‌మోద‌వుతున్నాయి. ఆదివారం కూడా 1,078 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య డెబ్బై వేల మార్కును దాటి 71,064కు చేరింది. ఇందువల్ల గుజ‌రాత్‌లో క‌రోనా మ‌ర‌ణాలు కూడా క్ర‌మం త‌ప్ప‌కుండా పెరుగుతున్నాయి. ఆదివారం కొత్త‌గా 25 మంది క‌రోనా బాధితులు ప్రాణాలు కోల్పోవ‌డంతో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 2,654కు చేరింది. ఎన్ని చట్టాలు తెచ్చిన ప్రజల్లో చైతన్యం కలిగి మాస్కులు ధరించి సాంగీక దూరాన్ని పాటిస్తే తప్పకుండ కట్టడి చేయవచ్చని అధికారులు చెపుతున్నారు.

Tags :
|
|
|

Advertisement