Advertisement

  • విటమిన్ సి తగ్గితే పొట్ట వస్తుంది... బరువు తగ్గాలంటే

విటమిన్ సి తగ్గితే పొట్ట వస్తుంది... బరువు తగ్గాలంటే

By: chandrasekar Wed, 14 Oct 2020 11:42 AM

విటమిన్ సి తగ్గితే పొట్ట వస్తుంది... బరువు తగ్గాలంటే


మన శరీరం బరువు తగ్గకపోవడానికి ఎన్నో కారణాలుంటాయి. వాటిలో విటమిన్ సి లోపం కూడా ఒకటి. చాలా పండ్లు, కూరగాయల్లో ఉండే విటమిన్ సిలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. రోజూ తగిన పండ్లు, కూరగాయలు తింటే సరిపడా విటమిన్ సి దొరుకుతుంది.

అస్కార్బిక్ యాసిడ్‌గా పిలిచే విటమిన్ సి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. రకరకాల వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది. మీరు అధిక బరువును తగ్గించుకునే ప్రయత్నాల్లో ఉంటే, మీకు ఎంతకీ పొట్ట తగ్గట్లేదని అనిపిస్తే వెంటనే మీరు విటమిన్ సి ఉండే పండ్లు, కూరగాయల్ని ఎక్కువగా తీసుకోవాలి.

నిజానికి విటమిన్ సి వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ఇది గుండెకు మేలు చేస్తుంది. కాన్సర్ వచ్చే అవకాశాల్ని తగ్గిస్తుంది. చర్మం ఆరోగ్యవంతంగా ఉండాలన్నా, ఎముకలు బలంగా ఉండాలన్నా విటమిన్ సి అవసరం. శరీర బరువును క్రమబద్ధీకరించడంలో విటమిన్ సి కీలకమైంది.

మన శరీరంలోని కొవ్వు కణాలు శక్తిని ఉత్పత్తి చేసేలా విటమిన్ సి చేస్తుంది. అందువల్ల కొవ్వు కణాలు పెరగకుండా ఉంటాయి. అదే విటమిన్ సీ తక్కువగా ఉంటే ఆటోమేటిక్‌గా నడుం చుట్టూ రింగులా కొవ్వు పేరుకుపోయి పొట్ట వచ్చేస్తుంది.

విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాలు: ఉసిరి, నారింజ, నిమ్మకాయ, కివి, ద్రాక్ష, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, టమాటా, జామకాయ, మామిడికాయ, స్ట్రాబెర్రీ, బ్రకోలీ, మొలకలు, కాలీఫ్లవర్, బంగాళాదుంపలు

రోజూ ఎంత కావాలి : మగవాళ్లు రోజూ 90 మిల్లీగ్రాముల విటమిన్ సి తీసుకోవాల్సి ఉంటుంది. ఆడవారు రోజూ 75 మిల్లీగ్రాములు పొందాల్సి ఉంటుంది. కానీ... పెద్దవాళ్లు రోజుకు 2వేల మిల్లీగ్రాములకు మించి విటమిన్ సి తీసుకోకూడదు. అలా చేస్తే కడుపునొప్పితోపాటూ ఇతర అనారోగ్యాలు వస్తాయి.

Tags :
|

Advertisement