Advertisement

  • పాజిటివ్‌ అని తేలినా లక్షణాలు లేకుంటే హోం క్వారంటైనే

పాజిటివ్‌ అని తేలినా లక్షణాలు లేకుంటే హోం క్వారంటైనే

By: chandrasekar Tue, 02 June 2020 1:49 PM

పాజిటివ్‌ అని తేలినా లక్షణాలు లేకుంటే హోం క్వారంటైనే


కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజూకీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గాంధీ ఆస్పత్రి కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలినప్పటికీ ఆ లక్షణాలు లేనివారిని ఇకపై హోం క్వారంటైన్‌లోనే ఉంచాలని నిర్ణయించారు. అలాంటి వారికి నేటి నుంచి గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకోరని ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు.

కరోనా ఉన్నప్పటికీ లక్షణాలు లేని వ్యక్తుల ఇళ్లను అధికారులు పరిశీలించాలని, ఇతరులకు సోకకుండా ప్రత్యేక బెడ్ రూమ్, వాష్ రూమ్, మరుగుదొడ్డి వేర్వేరుగా ఉన్నవారినే హోం క్వారంటైన్లకు అనుమతిస్తారని ఆయన తెలిపారు. సరైనా సదుపాయాలు లేకపోతే వారిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తారని పేర్కొన్నారు.

if there,are no,positive,qualities,home ,పాజిటివ్‌, అని తేలినా, లక్షణాలు, లేకుంటే, హోం క్వారంటైనే


కరోనా సోకి హోం క్వారంటైన్‌లో ఉండే వారికి ప్రభుత్వ వైద్యాధికారులే మందులు సరఫరా చేస్తారని వివరించారు. హోం క్వారంటైన్లలో ఉన్నవారిని డీఎంహెచ్ఓ, ఇతర వైద్య సిబ్బంది పర్యవేక్షిస్తుంటారని పేర్కొన్నారు. ఒకవేళ కరోనా లక్షణాలు లేకుండా పాజిటివ్ వచ్చినవారికి శ్వాస సంబంధిత మధుమేహం, కిడ్నీ ఇతర వ్యాధులు ఉన్నవారిని గర్భిణులు, వృద్దులను మాత్రమే ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకోనున్నారు.

ప్రస్తుతం కరోనా అనుమానితులకు పలు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తుండగా, పాజిటివ్‌గా తేలిన వారిని మాత్రం గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇప్పటివరకు స్వల్ప లక్షణాలు ఉన్నవారి సంఖ్య సుమారు 400-500 వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. వీరందరినీ ఒకేసారి డిశ్చార్జి చేయాలా వద్దా అనే అంశంపై వైద్యులు ఆలోచన చేస్తున్నారు.

Tags :
|

Advertisement