Advertisement

  • స‌చిన్ ఒప్పుకోకుంటే వీరూకు వ‌న్డేల్లో ఓపెనింగ్ అవ‌కాశ‌మే ద‌క్కేది కాదు: అజ‌య్ రాత్రా

స‌చిన్ ఒప్పుకోకుంటే వీరూకు వ‌న్డేల్లో ఓపెనింగ్ అవ‌కాశ‌మే ద‌క్కేది కాదు: అజ‌య్ రాత్రా

By: chandrasekar Fri, 17 July 2020 4:51 PM

స‌చిన్ ఒప్పుకోకుంటే వీరూకు వ‌న్డేల్లో ఓపెనింగ్ అవ‌కాశ‌మే ద‌క్కేది కాదు: అజ‌య్ రాత్రా


ఓపెన‌ర్‌గా ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు స‌చిన్ టెండూల్క‌ర్. కానీ ఓ సంద‌ర్భంలో త‌న పొజిష‌న్‌ను వీరేంద్ర సెహ్వాగ్ కోసం త్యాగం చేయాల్సి వ‌చ్చింది. వ‌న్డేల్లో ఓపెనింగ్ స్టాట్‌ను సెహ్వాగ్‌కు స‌చినే త్యాగం చేసిన‌ట్లు మాజీ వికెట్ కీప‌ర్ అజ‌య్ రాత్రా తెలిపారు. వీరూను ఓపెన‌ర్‌గా ప్ర‌మోట్ చేయ‌డంలో స‌చిన్‌, గంగూలీ పాత్ర కీల‌క‌మైంద‌న్నాడు.

వాస్త‌వానికి ఓపెన‌ర్‌గా స‌చిన్ దూసుకువెళ్తున్నాడు, కానీ 2001లో కివీస్‌తో జ‌రిగిన వ‌న్డేలో సెహ్వాగ్‌ను ఓపెనింగ్ పంపాల్సి వ‌చ్చింది, స‌చిన్ ఆ మ్యాచ్‌లో నాలుగ స్థానంలో దిగాడు. అప్పుడు గంగూలీతో క‌లిసి సెహ్వాగ్ ఓపెనింగ్ బాధ్య‌త‌లు చేప‌ట్టాడ‌ని అజ‌య్ రాత్రా చెప్పాడు. ఒక‌వేళ అప్పుడు స‌చిన్ త‌న ఓపెనింగ్ పొజిష‌న్ వ‌దులుకునేందుకు అంగీక‌రించ‌కుంటే, అప్పుడు వీరూ లోయ‌ర్ ఆర్డ‌ర్‌లో బ్యాట్ చేయాల్సి వ‌చ్చేద‌న్నాడు.

స‌చిన్ ఒప్పుకోకుంటే వీరూకు వ‌న్డేల్లో ఓపెనింగ్ చేసే అవ‌కాశ‌మే ద‌క్కేది కాద‌ని రాత్రా తెలిపాడు. ఓపెన‌ర్‌గా తొలి మ్యాచ్‌లో సెహ్వాగ్. 54 బంతుల్లో 33 ర‌న్స్ చేశాడు. కానీ మ‌రో రెండు మ్యాచ్‌ల త‌ర్వాత అత‌ను సెంచ‌రీ చేసి అంద‌ర్నీ ఆక‌ట్టుకున్నాడు. నిజానికి ఆ స‌మ‌యంలో ఇండియ‌న్ బ్యాటింగ్ లైన‌ప్ స‌రిగా లేదు. దీంతో లోయ‌ర్ ఆర్డ‌ర్‌లో వ‌చ్చి 45 ఓవ‌ర్ల వ‌ర‌కు ఆడేందుకు స‌చిన్ అంగీక‌రించాడు. దీంతో ఓపెనింగ్ పొజిష‌న్‌ను సెహ్వాగ్‌కు ఇవ్వాల్సి వ‌చ్చింద‌ని రాత్రా గుర్తు చేశాడు.

అయితే వ‌చ్చిన అవ‌కాశాన్ని వినియోగించుకున్న సెహ్వాగ్. ఓపెన‌ర్‌గా ఫుల్ స‌క్సెస్ అయ్యాడు. 2002 నాట్‌వెస్ట్ ట్రోఫీ ఫైన‌ల్లో ఓపెనింగ్ వ‌చ్చిన సెహ్వాగ్‌, గంగూలీలు అద‌ర‌గొట్టారు. సెహ్వాగ్ ఆట‌శైలిపై కొంద‌రు పెద‌వి విరిచినా అత‌ను మాత్రం త‌న జోరును త‌గ్గించ‌లేదు. టెస్టులు, వ‌న్డేల్లో సెహ్వాగ్ కెరీర్ బెస్ట్‌గా నిలిచింది. ఓపెన‌ర్‌గా అత‌ను 7518 ర‌న్స్ స్కోర్ చేశాడు. వ‌న్డేల్లో చేసిన 15 సెంచ‌రీల్లో 14 సెంచ‌రీలు ఓపెన‌ర్‌గానే పూర్తి చేశాడు.

Tags :
|
|
|
|

Advertisement