Advertisement

  • పేటీఎం ఎలాంటి చార్జీలు లేకుండా డబ్బు బదిలీ చేయాలి అనుకుంటే...?

పేటీఎం ఎలాంటి చార్జీలు లేకుండా డబ్బు బదిలీ చేయాలి అనుకుంటే...?

By: chandrasekar Mon, 19 Oct 2020 3:38 PM

పేటీఎం ఎలాంటి చార్జీలు లేకుండా డబ్బు బదిలీ చేయాలి అనుకుంటే...?


మీరు పేటీఎం వినియోగదారులైతే ఇకపై క్రెడిట్ కార్డు వాడి పేటీఎం వ్యాలెట్ లో మీరు డబ్బు ట్రాన్ఫర్ చేస్తే 2 శాతం క్రెడిట్ చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. గతంలో రూ.10,000 కన్నా ఎక్కువ నగదును క్రెడిట్ కార్డు నుంచి వ్యాలెట్ లోకి బదిలీ చేస్తే ఈ చార్జీలు ఉండేవి. కానీ ఇప్పుడు ఈ లిమిట్ ఎత్తివేశారు.

చార్జీలు లేకుండా...

క్రెడిట్ కార్డు వినియోగించి నగదు లావాదేవీలు జరిపినప్పుడు బ్యాంకులకు పేటీఎం చార్జీలు చెల్లిస్తుంది అని.

అందుకే ఈ నామ మాత్రపు చార్జీలు వేస్తున్నాం అని పేర్కొంది పేటీఎం. అయితే ఎలాంటి చార్జీలు లేకుండా డబ్బు బదిలీ చేయాలి అనుకుంటే మాత్రం యూపీఐ ( UPI ) లేదా డెబిట్ వాడమని సంస్థ సలహా ఇస్తోంది.

వినియోగదారులు తమ క్రెడిట్ కార్డు నుంచి పేటీఎం వ్యాలెట్ లో మనీ ట్రాన్ఫర్ చేసినప్పుడు తాము చార్జీలను బ్యాంకులకు చెల్లించేవాళ్ల౦. కానీ, ఇప్పుడు ఈ చార్జీలను వినియోగదారులకు బదిలీ చేస్తున్నాం అని తెలిపింది.

వినియోగదారులకు ఊరట కల్పించడానికి వ్యాలెట్ నుంచి బ్యాంకు ఖాతాలోకి నగదు మార్చే సమయంలో విధించే 5 శాతం చార్జీలను రద్దు చేశాం అని పేర్కొంది.

Tags :
|
|

Advertisement