Advertisement

  • ధోని లేకపోతే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సగం అవుతుంది ..ఆకాష్ చోప్రా

ధోని లేకపోతే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సగం అవుతుంది ..ఆకాష్ చోప్రా

By: Sankar Sun, 06 Sept 2020 3:15 PM

ధోని లేకపోతే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సగం అవుతుంది ..ఆకాష్ చోప్రా


ఐపీయల్ లో ఎన్ని జట్లు ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎప్పుడు ప్రత్యేకమే ..ఇప్పటిదాకా ఆడిన అన్ని సీజన్ లలో ప్లే ఆఫ్ కు చేరిన ఒకే ఒక జట్టుగా చెన్నై నిలిచింది..మరి చెన్నై ఈ స్థాయిలో రాణించడానికి గల ముఖ్య కారణం ఆ జట్టు కెప్టెన్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని ..అందుకే రైనా , హర్భజన్ వంటి స్టార్ ఆటగాళ్లు లేకపోయినా కూడా చెన్నై పెద్దగా ఇబ్బంది పడటం లేదు అంటే దానికి కూడా ధోని ఉన్నాడనే కొండంత బలం..

అయితే ధోని లేక‌పోతే సీఎస్‌కే పరిస్థితి ఏంటి అనేదే ప్ర‌శ్న‌గా మిగిలిపోయింది. ఏదో ఒక‌రోజు ధోని ఐపీఎల్‌కూ రిటైర్మెంట్ ప్ర‌క‌టించాల్సిందే. అప్ప‌డు ఏం జ‌రుగుతుంది.? ఇదే విష‌య‌మై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలో మాట్లాడాడు. "ధోని లేక‌పోతే సీఎస్‌కే స‌గం అవుతుంది. జ‌ట్టు స‌మ‌స్య‌ల్లో ప‌డుతుంది." అని ఆకాశ్ అన్నాడు.

"ఏదో ఒక రోజు ధోని సీఎస్‌కేకు కూడా రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తాడు. అప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ భారీ నష్టాన్ని చవిచూస్తుంది. ఎందుకంటే ఆ జట్టును ధోని న‌డిపించే విధానం అలాంటిది. అత‌డిలా జ‌ట్టును న‌డిపే వారు ఉండ‌ర‌ని నా అభిప్రాయం" అని చోప్రా అన్నాడు. "సీఎస్‌కేకు త‌రువాత ఎవ‌రు కెప్టెన్ అయినా.. ధోనీలా జ‌ట్టును న‌డ‌ప‌లేర‌ని నేను అనుకుంటున్నా. అయితే కెప్టెన్‌గా రాజీనామా చేసినా.. ధోని జ‌ట్టులో ఏదో ఒక ప‌ద‌విలో.. బ్రాండ్ అంబాసిడర్‌గా, గురువుగా ఉండి చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు మ‌ద్ద‌తుగా ఉంటాడ‌ని నేను భావిస్తున్నా. ఎందుకంటే ధోనికి, సీఎస్‌కేకు ఉన్న బంధం అలాంటిది." అని చోప్రా చెప్పాడు.

Tags :
|
|

Advertisement