Advertisement

కరోనా వ్యాక్సిన్ వస్తే తొలుత వారికే

By: Sankar Tue, 30 June 2020 7:32 PM

కరోనా వ్యాక్సిన్  వస్తే తొలుత వారికే



కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన అనంతరం ముందుగా ఆరోగ్య సిబ్బంది, ఇతర బడుగు బలహీన వర్గాలకు ఈ టీకా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్టు తెలిసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు కోటి మంది కరోనా బారిన పడిన నేపథ్యంలో టీకా సంజీవని కోసం యావత్ ప్రజానీకం కళ్లల్లో వత్తులేసుకుని ఎదురుచూస్తోంది. ఈ దిశగా చేపట్టిన పరిశోధనల్లో కూడా మెరుగైన ఫలితాలు రావడంతో ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ మానువులపై పరీక్షించే స్థాయికి చేరుకుంది. ఇందులో కూడా మంచి ఫలితాలు వస్తే.. కరోనా టీకా మార్కెట్లో విడుదలవుతుంది.

కాగా.. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన అనంతరం ఎలా పంపిణీ చేయాలనే దానిపై మోదీ సమావేశంలో విస్తృత చర్చ జురిగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా..టీకా తయారీ, పంపిణీ వ్యవస్థల పటిష్టీకరణ, హై రిస్క్‌లో ఉన్న వర్గాలు ఏవీ, వ్యాక్సిన్ ముందుగా ఎవరికి ఇవ్వాలి, పంపిణీలో భాగమైన వివిధ సంస్థ మధ్య సమన్వయం ఎలా సాధించాలి, ప్రైవేటు రంగం, పౌరుల భాగస్వామ్యం వంటి అంశాలపై కేంద్రం దృష్టి సారించింది.

అంతేకాకుండా.. టీకా తయారీ కేంద్రాలను నిరంతరం పర్యవేక్షించేందుకు రియల్ టైం మానిటరింగ్ విధానం కూడా అవలంబిస్తుందని సమాచారం. వ్యాక్సిన్‌ను తక్కువ ధరకు, అందరికీ అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది.

Tags :
|
|

Advertisement