Advertisement

  • దేశంలో ఇప్పటికే 20 కోట్ల మందికి కరోనా వచ్చిపోయింది.. ఐసీఎంఆర్‌ సర్వేలో సంచలన విషయాలు

దేశంలో ఇప్పటికే 20 కోట్ల మందికి కరోనా వచ్చిపోయింది.. ఐసీఎంఆర్‌ సర్వేలో సంచలన విషయాలు

By: Sankar Tue, 29 Sept 2020 7:47 PM

దేశంలో ఇప్పటికే 20 కోట్ల మందికి కరోనా వచ్చిపోయింది.. ఐసీఎంఆర్‌ సర్వేలో సంచలన విషయాలు


కరోనాపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్‌) చేసిన సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారత్‌లో ఆగస్టుకల్లా దాదాపు 20 కోట్ల మందికి కరోనా వైరస్‌ వచ్చిపోయిందని వెల్లడించింది. దేశంలో 15.9 కోట్ల నుంచి 19.6 కోట్ల మందికి కరోనా సోకిందని, 10ఏళ్ల కంటే పై వయసున్న వారిలో ప్రతి 15మందిలో ఒకరికి కరోనా సోకినట్లు వెల్లడైంది.

పట్టణ స్లమ్‌ ఏరియాల్లో 15.6శాతం మందికి ఇప్పటికే కరోనా వచ్చిపోయిందని, నగరంలోని కాలనీల్లో కనీసం 8.2 శాతం మంది ఇప్పటికే కరోనా బారిన పడినట్లు పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో కనీసం 4.4శాతం మందికి కరోనా వచ్చిపోయిందని పేర్కొంది. వయసు, ఆడ, మగ తేడా లేకుండా కరోనా వ్యాప్తి చెందుతోందని తెలిపింది. శీతాకాలంలో వైరస్‌ వ్యాప్తికి మరింత అవకాశం పెరుగుతుందని పేర్కొంది..

కాగా దేశంలో కరోనా కేసులు తీవ్ర స్థాయిలో నమోదు అయితున్నాయి..రోజుకి దాదాపు 80 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయితున్నాయి..ప్రపంచంలో అమెరికా తర్వాత అత్యధిక కేసులు నమోదు అయితున్న దేశంగా ఇండియా నిలిచింది..అయితే రోజూవారిలో కేసుల్లో అయితే ఇండియా మొదటి స్థానంలో ఉంది..

Tags :
|
|

Advertisement