Advertisement

  • వచ్చే ఏడాది ఫస్ట్ క్వార్టర్‌ లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం.. ఐసిఎమ్మాఆర్

వచ్చే ఏడాది ఫస్ట్ క్వార్టర్‌ లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం.. ఐసిఎమ్మాఆర్

By: Sankar Thu, 12 Nov 2020 4:53 PM

వచ్చే ఏడాది ఫస్ట్ క్వార్టర్‌ లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం.. ఐసిఎమ్మాఆర్


భారత్ బయోటెక్ సంస్ధ రూపోందిస్తున్న కరోనా వ్యాక్సిన్ 4 కోట్ల డోసులు అందుబాటులో ఉన్నాయని ఐసిఎమ్మాఆర్ తెలిపింది. వచ్చే ఏడాది ఫస్ట్ క్వార్టర్‌లో వ్యాక్సిన్‌ అందుబాటు లోకి వచ్చే అవకాశం ఉందని ఐసిఎమ్మాఆర్ తెలిపింది.

భారత ప్రభుత్వం సహకారంతో భారత్ బయెటెక్ సంస్థ కొవాగ్జిన్ వ్యాక్సిన్ ను రూపోందిస్తోంది.కొవాగ్జిన్ తుది ద‌శ ట్ర‌య‌ల్స్ ఈ నెల‌లోనే ప్రారంభమయ్యాయ్. ఆస్ట్రాజెన్‌కా, కొవాగ్జిన్ వ్యాక్సిన్ల 4 కోట్ల డోస్‌లు ప్రజలకు అందుబాటులో ఉంచనున్నట్లు ఐసిఎమ్మాఆర్ తెలిపింది. ఇక మరో పక్క కొవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రయోగాల కోసం ఆర్‌ అండ్‌ డీ విభాగానికి 900 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు నిర్మలా సీతారామన్.

ఈ నిధులు హెల్త్ డిపార్టెమెంట్‌కు కాదని తెలిపారు. ఈ నిధులు బయోటెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌కు కేటాయిస్తున్నట్లు ప్రకటించటారు నిర్మలా సీతారామన్. కాగా కరోనా వ్యాక్సిన్ తయారీలో భారత కృషిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ ప్రధాని మోడీ మీహ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే

Tags :
|

Advertisement