Advertisement

  • 2021లో టీ20 ప్రపంచకప్ క్రికెట్‌ పోటీలకు ఇండియా ఆతిథ్యం

2021లో టీ20 ప్రపంచకప్ క్రికెట్‌ పోటీలకు ఇండియా ఆతిథ్యం

By: Dimple Sat, 08 Aug 2020 03:09 AM

2021లో టీ20 ప్రపంచకప్ క్రికెట్‌ పోటీలకు ఇండియా ఆతిథ్యం

వరుసగా మూడు సంవత్సరాల్లో ప్రపంచకప్‌ క్రికెట్‌ పోటీలు జరుగబోతున్నాయి. 2021, 2022 సంవత్సరాల్లో టీ20 ప్రపంచకప్‌ క్రికెట్ పోటీలుకాగా... 2023లో 50 ఓవర్లతో ఆడే క్రికెట్‌తో ప్రపంచకప్‌ పోటీలు నిర్వహించనున్నారు. క్రికెట్ అభిమానులకు ఆనందం కలిగించే వార్తను ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ ప్రకటించింది. 2020 సీజన్‌లో ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వాల్సిన టీ20 ప్రపంచకప్ పోటీలు కరోనా ప్రభావంతో వాయిదాపడ్డాయి. 2021 నిర్వహించే టీ20 ప్రపంచకప్‌ పోటీలకు ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది . ఐసీసీ ఉన్నతాధికారవర్గాలు నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. టి20 ప్రపంచ కప్ క్రికెట్ పోటీల నిర్వహణకు ఇండియాకు ఇవ్వాలని నిర్ణయించారు. 2021 అక్టోబరు -నవంబరు నెల వ్యవధిలో ఈ క్రికెట్ పోటీలను నిర్వహించబోతున్నారు. 2022 సంవత్సరంలో నిర్వహించతలపెట్టిన టి20 క్రికెట్ పోటీలకు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వనుంది. అక్టోబరు -నవంబరు మాసంలో యధావిధిగా టీ20 ప్రపంచకప్‌ క్రికెట్‌ పోటీలను నిర్వహించేందుకు సంబంధించిన వ్యవహారాలన్నీ ఆస్ట్రేలియా చూసుకుంటుంది. 2023లో ప్రపంచకప్‌ క్రికెట్‌ పోటీలు 50 ఓవర్లతో నిర్వహించే పోటీలనుకూ ఇండియా ఆతిథ్యమిస్తుందని ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. మహిళలజట్టుకు నిర్వహింపతలపెట్టిన ప్రపంచకప్‌ క్రికెట్‌ పోటీలను వాయిదా వేస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది.

Tags :
|
|
|
|
|

Advertisement